ఆంధ్రప్రదేశ్‌

జబర్దస్త్ కళాకారులపై దాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 10: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా కళింగాంధ్ర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రెండో రోజు తన హాస్యంతో అలరించేందుకు వచ్చిన జబర్దస్త్ కమేడియన్ పొట్టి నరేష్ బృందంపై కొంతమంది ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించినమే కాకుండా, వారిని జాతీయ రహదారిపై దారికాసి దాడి చేసిన సంఘటన ఉత్సవాలే సిగ్గుపడేలా చేసింది! అడిషనల్ ఎస్పీ పనసారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీరాములనాయుడులకు ఈ సంఘటనపై ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివశంకర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆదివారం రెండవ పట్టణ పోలీసు స్టేషన్ హౌస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కళింగాంధ్ర ఉత్సవాల్లో భాగంగా జబర్దస్ కమేడియన్ బృందం ప్రదర్శనకు సిద్ధం అవుతూ డయాస్ వెనుక గదిలో బృందంలో కొంతమంది అమ్మాయిలు దుస్తులు మార్చుకుంటున్న సమయంలో శ్రీకాకుళం నగరానికి చెందిన కొంతమంది ఆకతాయిలు అక్కడికి చేరి వారితో వాదులాటకు దిగారు. ఇది రాత్రి పది గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ విషయంపై నిర్వహకులకు బృందం సభ్యులు సమాచారం ఇవ్వటంతో అక్కడికి చేరిన బౌన్సర్లు ఆకతాయిలను వెళ్ళగొట్టే ప్రయత్నంలో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం రాత్రి ఒంటి గంటకు కార్యక్రమం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణమైన పొట్టి నరేష్ బృందంపై పగ తీర్చుకునేందుకు ఆకతాయిలు కాపుకాసుకొని ఉన్నారు. వేదిక నుంచి బృందం బయలుదేరిన దగ్గర నుంచి ఆ వాహనాన్ని బైక్‌లతో వెంబడించి రాళ్ళతో దాడి చేశారు ఆకతాయిలు, దీంతో భయాందోళనకు గురైన ఆ బృందం సభ్యులు 16 నెంబర్ జాతీయ రహదారి సమీపంలోని నవభారత్ వద్ద వాహనాన్ని ఆపేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, కార్యక్రమం నిర్వహకులు ఐటీడీఏ పీవో శివశంకర్, డిపీఆర్‌వో రమేష్ అక్కడికి చేరుకున్నారు. బృందంపై దాడికి పాల్పడిన ఐదుగురు ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు బృందం సభ్యులను స్టేషన్‌కు రప్పించి జరిగిన విషయంపై ఐటీడీఏ పీవో శివశంకర్ సమక్షంలో ఆకతాయిలపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రత మధ్య బృందం సభ్యులను విశాఖపట్నం పంపించారు. ఈ సంఘటనలో ఇంకా ఎంతమంది పాల్గొన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కళింగాంధ్ర ఉత్సవ్‌కు భద్రతలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కన్పించింది. జబర్థస్త్ బృందం కార్యక్రమంలో అదుపుతప్పి చిందులేసిన ఆకతాయిలను అదుపుచేయాలంటూ ఉత్సవ్ కన్వీనర్, ఐటీడీఏ పీవో శివశంకర్ పోలీసులను విజ్ఞప్తి చేస్తూ వారిని అదుపుచేయాలంటూ కోరారు. కానీ, పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆకతాయిల చిందులు మరింత ఎక్కువయ్యాయి. వేదికపైకి వచ్చి కళాకారులపైకి వెళ్తున్నా పోలీసులు చలించకపోగా, అక్కడ ఉన్న బౌన్సర్లు చొరవ తీసుకుని వారిని అడ్డుకున్న సమయంలో ఘర్షణ జరిగింది. అదుపులోకి తీసుకోవల్సిన పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం, బందోబస్తులో పోలీసులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని స్థానికులు విమర్శించారు.