ఆంధ్రప్రదేశ్‌

స్టీల్ సెక్టార్‌లో పింఛన్ పథకానికి పచ్చజెండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉక్కునగరం, ఫిబ్రవరి 11: ఉక్కు తయారీ దిగ్గజాలు విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్, స్టీల్ ఆథార్టీ ఆప్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) పరిధిలో గల కర్మాగారాల ఉద్యోగులు, అధికారుల పింఛన్ పథకానికి కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పచ్చజెండా ఊపింది. ఏన్నాళ్లగానో కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సుమారు ఒక లక్షా 50వేల మంది ఉద్యోగులు, అధికారుల పింఛన్ ఆశలు సాకారమయ్యే మంచి రోజులు వచ్చాయి. విశాఖ ఉక్కు సెయిల్ పరిధిలో ఉన్న ఉద్యోగులు, అధికారుల పింఛన్ పథకానికి కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఎట్టకేలకు సోమవారం ఆమోదముద్ర వేసింది. విశాఖ ఉక్కు, సెయిల్ సంస్థలకు చెందిన పెన్షన్ పథకం ఫైల్‌పై కేంద్ర ఉక్కు ఉప కార్యదర్శి అనిల్‌కుమార్ ఆమోదం తెలిపారు. దీంతో గత 12 ఏళ్లగా పింఛన్ పథకానికి పట్టిన గ్రహణం వీడినట్లు అయింది. డీసి గైడ్‌లైన్స్ ప్రకారం విశాఖ ఉక్కు, సెయిల్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులకు పింఛన్‌ను చెల్లించనున్నారు. స్టీల్ సెక్టార్లలోని నాన్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగులకు 2012 జనవరి 1 నుండి, అధికారులకు 2007 జనవరి 1 నుండి పింఛన్ పథకం ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు. ఉద్యోగుల డీఏ, బేసిక్‌పై 9శాతానికి మించి కుండా పింఛన్ నిధికి యాజమాన్యం వాటా జమ చేయనున్నారు. ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగిసిన అనంతరం యాజమాన్యం వాటాను పింఛన్ నిధిలో జమ చేయనున్నారు. అనివార్య కారణాల వల్ల ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితి బాగోలేక నష్టాలు వస్తే అధికారులకు గరిష్టంగా 3శాతం, ఉద్యోగులకు 2శాతం చొప్పన మాత్రమే పింఛన్ నిధిలో జమ చేయనున్నారు. అయితే అధికారులు, ఉద్యోగుల మధ్య పింఛన్ పథకం తీవ్ర అంతరం ఉండడం పట్ల పలు కార్మిక సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలావుండగా దేశంలో స్టీల్ సెక్టార్లలో 94వేల మంది సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు, అధికారులు, మరో 56 వేల మంది పదవీ విమరణ చేసిన ఉద్యోగులు, అధికారులు ఈ పథకం ద్వారా పింఛన్‌ను పొందనున్నారు. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారు, త్వరలో పదవీ విరామణ చేసే ఉద్యోగులు అధికారులకు ఇది తీపి కబురు. ఇప్పటికే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, అధికారులకు ఈపీఎఫ్-95 పథకం కింద నామమాత్రపు పింఛన్ రావడంతో పలువురు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరలో ఈ పింఛన్ పథకం అమల్లోకి వస్తే ఇప్పటికే పదవీ విరమణ చేసి ఉద్యోగులు, అధికారుల ఆర్థిక వెతలు తీరనున్నాయి. పింఛన్ పథకానికి కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆమోదం తెలపడంతో విశాఖ ఉక్కు అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా చేసిన పోరాటాలకు విజయంగా అభివర్ణించారు.