ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగుల సొంత ఇంటి కలను నిజం చేసిన ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: సచివాలయ, శాఖాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు రాజధానిలో ఇంటి స్థలాలు మంజూరుకు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ టీవీ ఫణిపేర్రాజులు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే వివిధ జిల్లాలో పనిచేసే ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా 10 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక విశ్రాంత ఉద్యోగుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.
ఎన్‌జీఓ సంఘం కృతజ్ఞతలు
సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయంలో పని చేస్తున్న దాదాపు 5వేల ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఏపీఎస్‌జీఓ సంఘం అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
సచివాలయంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం
సచివాలయ ఉద్యోగుల కోసం వెలగపూడి సచివాలయంలోని ఆసుపత్రిలో ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఈ- కంటి కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాల్లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాల్ని అందజేస్తున్నారని అన్నారు. ఈ శిబిరంలో ఆటో రిఫ్రాక్టో మీటర్, ఫండస్ కెమెరా వంటి ఐ కేర్ డివైజెస్ అందుబాటులో ఉన్నాయన్నారు.