ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి ప్రత్యామ్నాయం మా కూటమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, ఫిబ్రవరి 15: రాబోయే ఎన్నికల్లో రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యామ్నాయ మార్గంగా చూపించగలిగేది సీపీఎం, సీపీఐ జనసేన పార్టీల కూటమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో మూడు పార్టీల ప్రత్యామ్నాయ రాజకీయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సభా స్థలి వరకు ఎర్రదండు కవాతు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, వైసీపీలు రాష్ట్రంలో అధికారం కోసం మళ్లీ ఎందుకు రావాలని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ శతశాతం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన తాయిలాలకు ప్రజలకు లొంగిపోరన్నారు. నాలుగున్నరేళ్లపాటు రాష్ట్రానికి, ప్రజలకు అన్యాయం చేసిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు వస్తున్నప్పుడు మాయమాటలు చెప్పడం, అమలు కాని బూటకపు హామీలు ఇవ్వడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైసీపీ అసెంబ్లీకి వెళ్లకుండా మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిపించాలని ఎందుకు అడుగుతున్నట్లో అర్థం కావడం లేదన్నారు. ప్రజల అభివృద్ధి కోసం అండగా ఉండేది కమ్యూనిస్టులు ఒక్కరేనన్నారు. ఉపాధి హామీ పథకం, అటవీ, హక్కుల చట్టాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించినప్పటికీ వాటిని అమలుచేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తమకు తోడు కావడంతో రాష్ట్ర ప్రజల అభివృద్ధికి మార్గం సుగమం అయ్యిందన్నారు. కోట్లాది రూపాయలు అవినీతికే తప్ప అభివృద్ధికి కాదని ఆరోపించారు. స్థానికంగా రాజులు తమ కోటలలో కూర్చొని పదవులు అనుభవించడమే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. ప్రముఖ రాజకీయ వేత్త, స్వార్థంలేని కిశోర్‌చంద్రదేవ్ టీడీపీలోకి చేరడం వలన పరువుపోతుందే తప్ప ప్రయోజనం ఉండదన్నారు. రాబోయే ఎన్నికల్లో గిరిజనులంతా ఏకమై తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, సీపీఎం నాయకులు కోలక లక్ష్మణమూర్తి, సీపీఎం నాయకులు కామేశ్వరరావు, ఒమ్మి రమణ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.