ఆంధ్రప్రదేశ్‌

ఎంబీసీలపై టిడిపి కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23:బీసీల పార్టీగా పేరున్న తెలుగుదేశం అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ)పై పూర్తి స్థాయి దృష్టి సారించింది. జనాభాలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉండగా, వారిలో కూడా ఎంబీసీలే ఎక్కువ సంఖ్యలో ఉన్నందున, వారిని ఆకర్షించే ప్రణాళికలకు పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటయిన ఎంబీసీ కార్పొరేషన్ లక్ష్యం కూడా అదే. త్వరలో దానికీ చైర్మన్‌ను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది.
ఎంబీసీలను ఆకట్టుకునే విధానంలో బాబు బీహార్ బాట పడుతున్నారు. వారికి పెద్దపీట వేయడం ద్వారా, మళ్లీ అధికారంలోకి వచ్చిన నితీష్‌కుమార్‌ను బాబు ఆదర్శంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఎంబిసిలకు చెందిన అన్ని కులాల ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు పాలకమండళ్లను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసింది. ఈసారి వినూత్నంగా గతంలో పార్టీకి బాగా కష్టపడి పనిచేసిన ఎంబీసీ నేతలను స్వయంగా గుర్తించి, వారు సైతం ఊహించని విధంగా డైరెక్టర్ల పదవులిచ్చింది. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, వడ్డెర వంటి అత్యంత వెనుకబడిన కులాలను ప్రోత్సహించడం ద్వారా, ఎంబీసీ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలన్న వ్యూహంతో వెళుతున్నారు.
సమైక్య రాష్ట్రంలో బాబు..తెలంగాణలో గౌడ, యాదవ, మున్నూరు కాపులను, ఏపిలో కొప్పుల వెలమ, యాదవ, శెట్టిబలిజ, తూర్పు కాపులను ఎక్కువగా ప్రోత్సహించారు. అత్యంత వెనుకబడిన కులాలపై పెద్దగా దృష్టి సారించలేదు. అప్పట్లో కాంగ్రెస్ ఒక్కటే చాకలి వర్గానికి చెందిన బస్వరాజు సారయ్యకు తొలిసారిగా టికెట్ ఇచ్చింది.
దానితో ఎంబీసీలకు టికెట్లు ఇస్తే గెలుస్తారన్న నమ్మకం పార్టీ నాయకత్వానికి ఏర్పడింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపిలో ఉత్తరాంధ్రలో కొప్పుల వెలమ, కళింగ, తూర్పుకాపు, కోస్తాలో యాదవ, శెట్టిబలిజ వర్గాలకు నాయకులున్నారు. అన్ని పార్టీలూ ఆయా వర్గాల వారినే ప్రోత్సహిస్తున్నాయి. దానితో వడ్డెర, మత్స్యకారులు, పద్మశాలి వంటి కులాలు వెనకబడిపోయాయి. వడ్డెర, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ వంటి కులాలు ప్రతి నియోజకవర్గంలో కనీసం పదివేల మంది ఉండగా, తీర ప్రాంతాల్లో మత్స్యకారులదే పైచేయి. అయినప్పటికీ వారికి పార్టీ, ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించే నేతలు లేకుండా పోయిన విషయాన్ని బాబు ఆలస్యంగా గ్రహించారు.
కుల, చేతి వృత్తుల వారిని గంపగుత్తగా ఆకట్టుకునేందుకే అన్ని పెడరేషన్లూ పూర్తి చేసేందుకు, లోకేష్ నెలరోజుల నుంచి చేసిన కసరత్తు ఫలించింది. అందులో భాగంగా, వివిధ ఎంబీసీ ఫెడరేషన్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఆయా కులాల నుంచి కొత్త నాయకులను తయారుచేసే పని ప్రారంభించారు. పార్టీ సభ్యత్వం మొత్తం 50 లక్షలు కాగా అందులో ఏపిలో 28 లక్షలు. అందులో కూడా సగానికి పైగా బీసీలదే వాటా. ఈ గణాంకాలు పరిశీలించిన తర్వాతనే ఎంబీసీలపై దృష్టి సారించాలని లోకేష్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
కాగా, తాజాగా ప్రకటించిన విశ్వబ్రాహ్మణ కో ఆపరేటివ్ కార్పొరేషన్, వడ్డెర, శాలివాహన, సగర-ఉప్పర, నారుూ బ్రాహ్మణ, రజక ఫెడరేషన్ల పాలకవర్గ సభ్యులతో విజయవాడలో భారీ స్థాయిలో చేతి-కుల వృత్తుల వారిని సమీకరించి, వారి సమక్షంలో వచ్చే నెల 4,5 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయించాలని తెదేపా నిర్ణయించింది. దాదాపు లక్షమంది ఎంబీసీ కులాలతో బీసీ గర్జన మాదిరిగా బహిరంగసభ నిర్వహించడం ద్వారా, అత్యంత వెనుకబడిన కులాలన్నీ తెదేపా వైపే ఉన్నాయన్న సంకేతాలివ్వాలన్న లక్ష్యంతో వెళుతోంది. ఈ మేరకు పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ టిడి జనార్దన్ ఎంబీసీ నేతలతో భేటీ అవుతున్నారు. బీసీ నేత, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కనకాచారితో శనివారం భేటీ నిర్వహించారు.