ఆంధ్రప్రదేశ్‌

రైతు నేస్తంగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తానని, రైతు కుటుంబాలకుకి నేస్తంగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ముక్త్యాల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి రిమోట్ ద్వారా శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతూ రైతులు ఆనందంగా ఉన్నారా లేదా అని సమీక్షించుకోవాలన్నారు. 2014కు ముందు రైతుల పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందనేది ఆలోచించాలన్నారు. 489 కోట్ల రూపాయలతో ముక్త్యాల ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నామన్నారు. ఎకరానికి 1.28 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని అన్ని గ్రామాల రైతులకు ఈ పథకం వల్ల ఎనలేని ప్రయోజనం కలుగుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు 70 వేల కోట్ల రూపాయలు వరకూ ఖర్చు చేశామన్నారు. 69 ప్రాజెక్టులు చేపట్టామని, అందులో 19 ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు.
మరో నాలుగు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశంలో ఎంతోమంది మాటలు చెప్పారు కానీ తొలిసారిగా నదుల అనుసంధానం చేసిన రాష్ట్రం ఏపీ అని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు వాడుకోవడం, రాయలసీమ ప్రజలు కృష్ణా జలాలను వినియోగించుకోవడం అపూర్వమన్నారు. పోలవరం పనులు గిన్నిస్ రికార్డు స్థాయిలో ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా జరగనంత వేగంగా సాగుతున్నాయన్నారు. నూరు కిలోమీటర్ల మేర ఏకధాటిగా నీళ్లు నిల్వ చేయడంలో ప్రపంచంలో ఎక్కడా లేదని, అమరావతిలో అది సాధ్యం అవుతోందన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని, రైతు ఏ మాత్రం కష్టపడకూడదన్నారు. అన్నదాతా సుఖీభవ పథకం రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకే చేపట్టామన్నారు. మైక్రో ఇరిగేషన్‌లో 10 జిల్లాలు దేశంలో ప్రథమ స్థానంలో ఉంటే అందులో 6 జిల్లాలు ఏపీలో ఉన్నాయన్నారు. వ్యవసాయం చేసే రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు అవసరమైన యంత్ర పరికరాలను రాయితీపై ఇస్తున్నామన్నారు. 6 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, ప్రపంచానికి మనం అందించే కానుక ప్రకృతి సేద్యమన్నారు. వ్యవసాయంలో సంక్షోభాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించాలన్నారు. 12 నెలల్లో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవానికి తానే వస్తానన్నారు. నేరుగా రైతు సోదరులను కలుసుకోవాలని అనుకున్నప్పటికీ, సమయాభావం వల్ల రాలేకపోయానని వివరణ ఇచ్చారు. ఆయకట్టుదారులందరికీ ఇక్కడి నుంచే అభినందనలు తెలుపుతున్నానన్నారు.
చిత్రం.. రిమోట్ ద్వారా ముక్త్యాల ఎత్తిపోతల పథకం శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు