ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ది నేర పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: ఏలూరులో వైకాపా నిర్వహించిన బీసీ గర్జన జగన్ పరిజ్ఞానాన్ని బయటపెట్టిందని మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ఆయనకు ఉన్నది నేరపరిజ్ఞానమే తప్ప ఆర్థిక పరిజ్ఞానం కాదన్నారు. ఆర్థిక నిర్వహణపై కనీస అవగాహన లేదని, చేసిన చట్టానే్న మళ్లీ చేస్తానంటారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే బీసీ సబ్‌ప్లాన్ చట్టం చేశామని గుర్తుచేశారు. మహిళలకు 75వేల రూపాయలు ఏవిధంగా ఇస్తారో చెప్పలేదన్నారు. 139 కార్పొరేషన్లు పెడతాననడం ఆయనకు ఉన్న పరిజ్ఞానాన్ని తెలియచేస్తోందన్నారు. తెలంగాణలో బీసీ జాబితా నుంచి 32 కులాలను తొలగించడంపై ఇప్పుడు కేసీఆర్‌తో మాట్లాడతానని చెబుతున్నారని, మూడున్నర ఏళ్లు ఏమిచేశారని ప్రశ్నించారు. టీడీపీ ఐదేళ్లలో చేసిన సంక్షేమంతో జగన్‌కు దిమ్మ తిరిగిందని, నిరాశకు లోనయ్యారని విమర్శించారు. టీడీపీకి బీసీలను దూరం చేయాలన్న ఆయన పన్నాగం ఫలించదని, ఆ మూడు పార్టీల కుతంత్రాలు పన్నినా బీసీలు తమవెంటే ఉంటారని మంత్రి కాలవ స్పష్టం చేశారు.