ఆంధ్రప్రదేశ్‌

రైతు కోటయ్య మృతిపై జ్యుడీషియల్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 20: ముఖ్యమంత్రి చంథ్రబాబు కొండవీటి కోట ఉత్సవాల పర్యటనలో భాగంగా చోటు చేసుకున్న రైతు పిట్టల కోటేశ్వరరావు (కోటయ్య) మృతి అంశంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది. వైసీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు బుధవారం కొండవీడు ప్రాంతంలో కోటయ్యకు చెందిన బొప్పాయి తోటను పరిశీలించి యడ్లపాడు మండలం కొత్తపాలెంలోని కోటయ్య గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతు కోటయ్య నిజంగా పురుగుల మందు తాగి మృతిచెందాడా, పోలీసులు కొట్టిన దెబ్బలతో చనిపోయాడా అనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జ్యుడిషియల్ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. పోలీసుల తప్పేమీ లేకుంటే మృతుని కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇస్తామంటూ కుటుంబ సభ్యులతో బేరం పెట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. పోలీసులు, అధికారుల భిన్నవాదనలపై విచారణ చేయించి కోటయ్య వద్ద పొలం పనిచేసే పున్నారావును విచారించాలని డిమాండ్ చేశారు.
ఈ పర్యటనలో వైసీపీ సీనియర్ నేతలు పార్ధసారథి, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకట రమణ, జంగా కృష్ణమూర్తి, వైసీపీ ఎమ్మెల్యేలు ముస్త్ఫా, కోన రఘుపతి, పి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని ఉన్నారు.