ఆంధ్రప్రదేశ్‌

ఇంధన సామర్థ్య కార్యకలాపాల్లో డ్వాక్రా మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 21: ఇంధన సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు ప్రధానంగా దీనికి సంబంధించిన కార్యకలాపాలను నవ్యాంధ్రప్రదేశ్‌లో విస్తృతపర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్నింటా అగ్రగామిగా నిలుస్తున్న డ్వాక్రా మహిళా సంఘాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దీనివల్ల కొంతమేర ఫలితాలు సాధించింది కూడా. స్వయం సహాయక మహిళా సంఘాలకు చెందిన దాదాపు 80 లక్షల మంది సభ్యులు ఇందులో భాగస్వామ్యమయ్యారు. 70 నుంచి 90 శాతం మేర పూర్తిస్థాయిలో విజయవంతంగా నిర్వహించడం కోసం సభ్యులందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ తరచూ నిర్వహిస్తోంది. ఇటీవల ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో సంఘాల ప్రతినిధులతోపాటు వివిధ వర్గాలకు చెందిన వినియోగదారులు, ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు. ఇదే తరహాలో రాష్టమ్రంతటా సదస్సులు, సభలు నిర్వహించాలని కూడా మిషన్ ఆలోచన చేస్తోంది. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతోపాటు ఎక్కువుగా ఉత్సాహం చూపుతోన్న యువత, కాలేజీ విద్యార్థులను దృష్టిపెట్టుకుని వీరిని ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా భాగస్వాములుగా చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించి వేర్వేరు రంగాలకు సంబంధించి 13,408 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ పొదుపును సాధించగా, దీని ద్వారా రూ.7,857 కోట్ల మేర ఆదా చేయగలిగినట్టు మిషన్ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా గృహ, పరిశ్రమలు, వ్యవసాయం, వీధి దీపాలకు సంబంధించి అనుబంధ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంచగలిగినట్టు మిషన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపపంచ దేశాల్లోనే భారతదేశంలో ఉన్న 48 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల కంటే కూడా ఉత్తమ ఇంధన సామర్థ్యం కలిగిన రాష్ట్రంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇది కేవలం ఎస్‌పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ వలనే ఫలితాలు సాధించగలిగామని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా కాంతివంతమైన, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఎల్‌ఇడీ వీధీ దీపాలు, ఏపీలో అన్ని జిల్లాల పరిధిలో ఏర్పాటు చేశారు.
స్కూల్స్, కాలేజీల్లో ఎనర్జీ క్లబ్‌లు...
సాంకేతిక, ఆర్థికపరమైన సహాయకారంతో పాఠశాలలు, కళాశాలల్లో ఎనర్జీ క్లబ్‌ల నిర్వహణకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఇఇ) ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఇంధన మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో నడిచే దీని ద్వారా మరికొంత మేర ఫలితాలు సాధించవచ్చనే లక్ష్యంతో ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను విస్తృతపరుస్తోంది. ఏపీలో ప్రతిఒక్క పాఠశాల, కళాశాలలో ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం ఇపుడు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులోభాగంగా కాలేజీల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా దీనికి ఏపీ స్టేట్ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) సహకరిస్తోంది.