ఆంధ్రప్రదేశ్‌

గుజరాత్ నుంచి ఎందుకు బహిష్కరించారో అమిత్ షా చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా జీవితం మొత్తం నేరమయమని, గతంలో ఆయనను గుజరాత్ నుంచి ఎందుకు బహిష్కరించారో ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ అడ్రస్ లేని బీజేపీకి ఏపీలో ప్రచారానికి వచ్చి, ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు షా ప్రయత్నించారని ఆరోపించారు. అమిత్‌షా గల్లీ రాజకీయాలు చేసే నాటికి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారని గుర్తు చేశారు. గోద్రా అల్లర్ల సందర్భంగా మోదీని రాజీనామా చేయమని కోరింది చంద్రబాబేనని, మోదీ దయ వల్ల చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పడం హాస్వాస్పదమన్నారు. షా అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. కిరాయి మనుషులు, వైకాపా పంపిన కార్యకర్తలతో షా సభలు నిర్వహిస్తున్నారని, అంతా కలిసి కుట్రలు పన్నుతున్నారన్నారు. ఏపీలో ఒక్క చోట కూడా బీజేపీకి డిపాజిట్ దక్కదని జోస్యం చెప్పారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ షా ప్రసంగాన్ని అనువదించిన పురంధ్రీశ్వరి బీజేపీలో, ఆమె కొడుకు వైకాపాలో ఉన్నారన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని ఎందుకు వైకాపా నిలదీయదని ప్రశ్నించారు.