ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ చార్జీలు పెరగవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏ కేటగిరీలోనూ విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ట్యారిఫ్ ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీలపై అభిప్రాయ సేకరణ ఇటీవల జరిగింది. అనంతరం ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడున్న విద్యుత్ చార్జీలను సమీపపు 5లేక 10 పైసలకు సరిచేసి కుదించింది. తగ్గించిన చార్జీ హెచ్‌టీ, ఎల్‌టీ కేటగిరీలకు వర్తిస్తుంది. దీనివల్ల 39.42 లక్షల మంది వినియోగదారులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 16 కేటగిరీలను, 51 సబ్ కేటగిరీలను, 25 శ్లాబ్‌లను 5 కేటగిరీలు, 30 సబ్ కేటగిరీలు, 21 శ్లాబ్‌లుగా కుదించింది. వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలు 8962కోట్ల రూపాయల మేర లోటు ఉంటుందని అంచనా వేయగా, దాన్ని మండలి సమీక్షించి 7064 కోట్ల రూపాయలకు తగ్గించింది. దీనివల్ల వినియోగాదారులపై 1898 కోట్ల రూపాయల మేర భారం తగ్గనుంది. పరిశ్రమలకు పీక్‌టైం, టైమ్ ఆఫ్ డే చార్జీలను యూనిట్‌కు 105పైసల నుంచి రూపాయికి తగ్గించారు. నాన్ కార్పొరేట్ రైతులకు రోజుకు 9గంటల ఉచిత విద్యుత్ వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ విలువ 7064కోట్ల రూపాయలకు చేరుతుంది. ఎల్‌టీలోని 10 హెచ్‌పీకి మించిన వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలను కేటగిరీ మార్పు చేయడం వల్ల యూనిట్‌కు 2.85 రూపాయల వరకూ లబ్ధి చేకూరుతుంది. పుట్టగొడుగులు, కుందేళ్ల పెంపకాన్ని వ్యవసాయ ఆధారిత కార్యకలాపాల కిందికి చేర్చడం వల్ల వాటి విద్యుత్ చార్జీలు, డిమాండ్ చార్జీలు తగ్గాయి. ఉప్పు తయారీ యూనిట్లకు విద్యుత్ చార్జీలు యూనిట్‌కు 1.20 రూపాయల మేర తగ్గించింది. డిమాండ్ చార్జీలను పూర్తిగా మినహాయించింది. గ్రీన్‌హౌస్‌లో పూలమొక్కల పెంపకానికి కూడా 1.06 రూపాయల మేర విద్యుత్ చార్జీలను తగ్గించింది. ఎల్‌టీ కేటగిరిలోని కోళ్ల హేచరీలు, కోళ్ల మేత మిక్సింగ్ ప్లాంట్లకు 1.04 రూపాయలను తగ్గించింది. విద్యుత్ వాహనాల వాడకాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో విద్యుత్ వాహనాలు, ఈవీ చార్జింగ్ స్టేషన్ల విద్యుత్ చార్జీని యూనిట్‌కు 1.95 రూపాయలు తగ్గించింది. బియ్యం మిల్లుల పరిశ్రమను సీజనల్ పరిశ్రమల కేటగిరి కిందికి చేర్చింది. అక్వాకల్చర్, పశుసంవర్ధకం, కోళ్ల హేచరీలు, కోళ్ల మేత మిక్సింగ్ ప్లాంట్లను వ్యవసాయ కేటగిరీ కిందికి మార్చింది. రైతులకు అత్యవసరంగా సరఫరా పొందేందుకు యూనిట్ చార్జీని 10.50 రూపాయల నుంచి 3.75 రూపాయలకు తగ్గించింది. ధార్మిక సంస్థలను లాభాపేక్ష లేని సర్వీసుగా సవరించింది. అనాథాశ్రమాలను ఈ కేటగిరీ కిందికి చేర్చింది.
2017 రెగ్యులేషన్-3 తేదీ నాటికి పనిచేస్తున్న కో-జనరేషన్ చక్కెర కర్మాగారాలకు రికార్డు చేసిన గరిష్ట డిమాండ్, విద్యుత్ ప్రమాదాల బాధితుల నష్టపరిహార నిధి కింద ఎపీఎస్‌పీడీసీఎల్‌లో 9కోట్ల రూపాయలు, ఏపీఈపీడీసీఎల్‌లో 10కోట్ల రూపాయలను కేటాయించింది. ఎల్‌టీ సరఫరా ప్రైవేట్ ఇరిగేషన్ పథకాల కింద వినియోగిస్తున్న రైతు బృందాలకు, పట్టణ ప్రాంత ఫీడర్లకు కనెక్టు చేసిన రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ సరఫరా పరిమితిని హెచ్‌పీకి 1500 యూనిట్లకు పెంచింది. ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ సామర్థ్యం పెంచేందుకు వీలుగా ఏపీసీడ్‌కో 3కోట్ల రూపాయలను కేటాయించింది.