ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూలై 23: విద్యుత్ కొరతకు తావులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దానని, ఫలితంగా పరిశ్రమల పురోగతి మరింత వేగవంతం కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడి వద్ద 102 కోట్ల వ్యయంతో నిర్మించే ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ సెంటర్ శంకుస్థాపన శనివారం జరిగింది. ఈ సందర్భంగా సభలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఎపీలో వచ్చిన సంక్షోభంపై నిరాశ చెందకుండా అవకాశంగా భావించి అభివృద్ధితో ముందుకు సాగుతున్నామన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఏపీలో ప్రగతి శరవేగంగా సాగుతోందన్నారు. సమస్యలెన్ని ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలపై కోత విధించకుండా వాటికి మరింత ప్రాముఖ్యతను పెంచుతున్నామన్నారు. అసంఘటిత కార్మికులకు ఐదులక్షల బీమా సదుపాయం, 43 లక్షల మందికి వెయ్యి రూపాయల పింఛన్, ఐదుకిలోల ఉచిత బియ్యం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలు అమలు చేస్తున్నామన్నారు. 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతంలో పోర్ట్‌ల అభివృద్ధితోపాటు మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లుగా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. భారతదేశంలోనే నెంబర్ వన్‌గా విశాఖ రావాలని అందుకు అనుగుణంగా ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి అన్నివిధాలుగా కృషి జరుగుతోందన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డ్వాక్రా మహిళలతో 150 ఎకరాల విస్తీర్ణంలో విదిగా ఒక పారిశ్రామికవాడ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారిశ్రామికంగా ఏపీని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడుల కోసం ప్రపంచమంతా తిరగాల్సి వస్తోందన్నారు. ఫలితంగా రానున్న కాలంలో విశాఖలో మరిన్ని పరిశ్రమలు రానున్నాయన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రం కలసి పనిచేస్తేనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయన్నారు. అటువంటి మంచి వాతావరణం ఆంధప్రదేశ్‌లో ప్రస్తుతముందన్నారు. దేశానికి వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లలాంటివన్నారు. ఈ రెండింటి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పారిశ్రామికాభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయన్నారు. వ్యవసాయికంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు వివరించారు. కేంద్ర ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ శాఖామాత్యులు కలరాజ్ మిశ్రా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికీకరణ అభివృద్ధికి సిఎం చంద్రబాబు చేస్తున్న కృషిని కొనియాడారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల వలన దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజల్లో ఆర్థిక పరిపుష్టి బాగా మెరుగు పడుతుందన్నారు. చిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రధాని మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. పరిశ్రమల్లో పనిచేసేందుకు అవసరమైన సాంకేతిక శిక్షణనిచ్చేందుకు దేశవ్యాప్తంగా 15ఎంఎస్‌ఎంఇ సెంటర్లు మంజూరు కాగా కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖకు అటువంటి సెంటర్‌ను సిఎం చంద్రబాబు చొరవ ఫలితంగా మంజూరు చేసామన్నారు. జిల్లా కలెక్టర్ యువరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ అవంతి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తదితరులు ప్రసంగించారు. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు.