ఆంధ్రప్రదేశ్‌

కోటి మొక్కలు నాటుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), జూలై 25: హరితాంధ్రప్రదేశే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన వనం-మనం ఉద్యమంలో స్ఫూర్తిని నింపుతూ విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుండి అధికారులు, ప్రజాప్రతినిధులతో నీరు-చెట్టు కార్యక్రమంపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల 29న నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. వనం - మనంలో నాటిన ప్రతీ మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని, టీం లీడర్లు ఎప్పటికప్పుడు దాని పెరుగుదలను పరిశీలిస్తూ సంరక్షించాలన్నారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని కోరారు.
నరేగా కింద నీరు-చెట్టు పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ పనులకు అందుబాటులో ఉన్న 635 కోట్ల రూపాయల విలువైన మెటీరియల్ కాంపొనెంట్ నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నరేగా నిధులు రూ. 8వేల కోట్లను పూర్తిగా వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఇన్‌స్టిట్యూషనల్ సోక్‌పిట్స్ తవ్వకాన్ని స్థానిక సంస్థలు చేపట్టాలన్నారు. సిఎం డ్యాష్‌బోర్డు తరహాలోనే డిస్ట్రిక్టు డ్యాష్‌బోర్డు, డిపార్టుమెంట్ డ్యాష్‌బోర్డులను రూపొందించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ భవనాలన నిర్మాణం, వర్మికంపోస్టు ప్లాంట్ల ఏర్పాటు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు మందకొడిగా జరగడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.