ఆంధ్రప్రదేశ్‌

24 వరకూ అపరాధ రుసుం లేకుండా ఎంసెట్‌కు దరఖాస్తుల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 22: ఎపి ఎంసెట్-2016కు అపరాధ రుసుం లేకుండా ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తుచేసుకునే అవకాశాన్ని ఉన్నత విద్యామండలి కల్పించింది. ఎపి ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చొరవతో ఈనెల 24వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్టు ఎపి ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు ‘మంగళవారం తెలిపారు. వాస్తవానికి ఈ నెల 22వ తేదీ నుండి రూ.500 అపరాధ రుసుంతో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవల్సి ఉంది. తాజా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని. కోరారు.
మే 9న నాగార్జున వర్శిటీలో పిఇ సెట్
విజయవాడ (స్పోర్ట్స్), మార్చి 22: ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పిఇసెట్ - 2016)ను మే 9న నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ వై కిషోర్ తెలిపారు. 2016-17 విద్యా సంవత్సరానికి బిపిఇడి 2 సంవత్సరాలు, యుజిడిపిఇడి 3 సంవత్సరాల కోర్సుకు ఎంట్రన్స్ టెస్ట్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో మే 9న జరుగుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.