ఆంధ్రప్రదేశ్‌

పార్టీలో చేరకుండానే టికెట్ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 19: విశాఖ జిల్లా రాజకీయాల్లో ఈ సారి అన్నీ సంచలనాలే. పార్టీలో చేరకుండానే టికెట్ దక్కించుకుని పోటీకి సిద్ధమైన నేత ఒకరితే, పార్టీ టికెట్ ఖరారు చేసిన తరువాత, పార్టీ కండువా మార్చేసిన అభ్యర్థి మరొకరు. ఇక పార్టీ మారిన 24 గంటల్లోనే టికెట్ ఖరారు చేసుకుని దర్జాగా ప్రచారం మొదలుపెట్టిన నేత మరొకరు. గత కొద్ది రోజుల్లో ప్రధాన రాజకీయ పక్షాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజనీకాన్ని అయోమయానికి గురిచేశాయి. విశాఖ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన మాజీ మేయర్, మాజీ ఎంపీ సబ్బం హరి గత ఐదేళ్లుగా ఏ రాజకీయ పార్టీలోనూ లేరు.
ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచి ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయతే టీడీపీ ఆఖరి జాబితాలో ఆయనకు భీమిలి అసెంబ్లీ టికెట్ ఇస్తూ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. అనంతరం ఆయన టీడీపీలో అధికారికంగా చేరారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ వైసీపీ తరపున విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ చేరిన 24 గంటలు గడవక ముందే వైసీపీ జాబితాలో ఆయనకు స్థానం దక్కింది. అప్పటికే వైసీపీ తరపున దక్షిణ నియోజకవర్గంలో సమన్వయ కర్తలుగా పనిచేస్తున్న కోలా గురువులు, డాక్టర్ రమణమూర్తిలను కాదని జగన్ అప్పుడే చేరిన ద్రోణంరాజుకు టికెట్ కేటాయించేశారు. ఇక జనసేన పార్టీ నుంచి విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని జనసేన ప్రకటించిన అభ్యర్థి గేదెల శ్రీనుబాబు హఠాత్తుగా మనసు మార్చుకుని వైసీపీలో చేరిపోయారు. టికెట్ కేటాయించిన తరువాత చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామంతో జనసేన వర్గాలు అయోమయానికి గురయ్యాయి. దీంతో పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు జనసేన విశాఖ ఎంపీ టికెట్ ఖరారు చేసింది. అయితే లక్ష్మినారాయణ కూడా పార్టీలో చేరిన 24 గంటల్లోనే జనసేన తరపున ఎంపీ టికెట్ దక్కించున్నారు.
ఇదిలా ఉండగా జిల్లా రాజకీయాల్లో ఉద్దండులుగా పేరున్న మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధం. సీనియర్ నేతలు ఐదేళ్ల కిందట వైసీపీలోనే ఉన్నారు. వైసీపీ నుంచి దాడి కుమారుడు రత్నాకర్, కొణతాల సోదరుడు రఘబాబు విశాఖ పశ్చిమ, అనకాపల్లి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఫలితాల అనంతరం ఈ నేతలంతా వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు.
తాజాగా ఎన్నికలకు ముందు దాడి వీరభద్రరావు వైసీపీలో చేరగా, కొణతాల టీడీపీ లేదా వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. వైసీపీలో చేరినప్పటికీ దాడి కుమారునికి టికెట్ దక్కలేదు. అయితే దాడికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి కట్టబెట్టి సమన్వయం చేసుకోవాల్సిందిగా అధినేత జగన్ స్పష్టం చేశారు. దీంతో జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణాలాలు రాజకీయంగా విస్తృత ప్రాధాన్యత సంతరించుకున్నాయనే చెప్పాలి.