ఆంధ్రప్రదేశ్‌

పవన్ పార్టీ మొత్తం టీడీపీ కోవర్టులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 20: సమాజంలో మార్పుకు శ్రీకారం చుడతామంటూ ఎన్నికల బరిలో దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ బలమైన అభ్యర్థులను మార్చి డమీలను రంగంలోగి దింపుతూ టీడీపీకి లోకపాయికారీ సహకరిస్తున్నారు. మార్పు అంటే పవన్ కల్యాణ్ దృష్టిలో అభ్యర్థులను మార్చడనంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సమాజంలో మార్పునకు యువత రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిచ్చిన పవన్ మాటకు ఎంతో మంది యువకులు, కొత్త వ్యక్తులు పార్టీలోకి వచ్చారు. బలమైన అభ్యర్థులుగా బరిలోకి దిగే వారందరినీ పోటీకి పరిశీలించకుండా బలహీనమైన అభ్యర్థులతో జాబితాను ప్రకటించారంటూ జనసైనికులు మండిపడుతున్నారు. దాదాపు రెండేళ్లుగా పార్టీ పిలుపు మేరకు జనసేన జనబాట పేరిట కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు వీరంతా టికెట్లు రాక తలలు పట్టుకుంటున్నారు. విశాఖలో తాజా పరిస్థితులు దీనికి అద్దం పడుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, డీసీసీబీ మాజీ చైర్ పర్సన్ అల్లు భానుమతి జనసేన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన అధినేత పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎందరో యువకులు ముందుకు వచ్చారని, అందులో తన మనుమడు రఘురాజు కూడా ఒకరన్నారు.