ఆంధ్రప్రదేశ్‌

కింకర్తవ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: పార్టీ మారినా ఎన్నికల్లో టికెట్లకు ఢోకా ఉండదని ఇప్పటివరకూ ధీమాతో తెదేపాలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. 2026 వరకూ నియోజకవర్గ పునర్విభజన ఉండదని అటార్నీ జనరల్ కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో, ఇక తమ రాజకీయ భవిష్యత్తేమిటన్న అంశం, వారిని భయాందోళనకు గురిచేస్తోంది. మళ్లీ టికెట్లు దక్కుతాయో, లేదోనన్న బెంగ పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలలో మొదలయింది. మళ్లీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారన్న భరోసాతో, తెదేపాలో చేరిన 20 మంది వైకాపా ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యం ఆందోళనలో పడింది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయి కాబట్టి, అందులో మీకు సీట్లు సర్దుబాటు చేస్తామన్న బాబు హామీని విశ్వసించి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేలకు, 2026 వరకూ సీట్ల సంఖ్య పెరగదన్న వార్త అశనిపాతంగా మారింది. 20 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిన విషయం తెలిసిందే. వర్మ, ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలిచి తెదాపాలో చేరినందున, వారికొచ్చిన భయం ఏమీ కనిపించడం లేదు. ఇక పలమనేరులో అమర్‌నాధ్‌రెడ్డి ఒక్కరికే స్థానికంగా తెదేపా నుంచి పెద్దగా పోటీ లేదు. ఎందుకంటే ఆయన గత ఎన్నికల ముందే తెదేపా నుంచి వైకాపాలో చేరారు. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి వచ్చారు. మిగిలిన 19 నియోజకవర్గాల్లో తెదేపా పాత సీనియర్లతో విపరీతమైన పోటీ కొనసాగుతోంది. ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లోనయితే దాదాపు ప్రతిరోజూ కొత్త-పాత ఎమ్మెల్యేలు ఘర్షణ పడి రోడ్డున పడుతూనే ఉన్నారు. అటు తెలుగుదేశంలో సీనియర్ల పరిస్థితి కూడా ఆందోళనగానే ఉంది. వైసీపీ నుంచి పార్టీలో చేర్చుకునే ముందు, వారి చేరికలకు అడ్డుపడిన సీనియర్లను బాబు బుజ్జగించారు. మీ భవిష్యత్తునకు వచ్చిన ఇబ్బందేమీలేదని, నియోజకవర్గ సంఖ్య పెరుగుతున్నందున మీకు కూడా సీటు ఇస్తామని భరోసా ఇచ్చారు. తాజా పరిణామంతో కొత్తగా వచ్చిన వారికే టికెట్లు ఇస్తారా? అన్న ఆందోళన సీనియర్లలో మొదలయింది.
అటు తెదేపాలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలదీ అదే పరిస్థితి. వారు దిగాలు పడినట్లు వారి మాటలే స్పష్టం చేస్తున్నాయి. ‘మోదీతో బాబుకు సంబంధాలున్నందున నియోజకవర్గ సంఖ్య పెంచడం కష్టమేమీ కాదనుకున్నాం. ఏదో ఒకరకంగా అయిపోతుందనుకున్నాం. బాబుగారు మళ్లీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినందుకే మేం పార్టీలోకి వచ్చాం. లేకపోతే వైసీపీలోనే ఉండేవాళ్లం కదా? అక్కడ మాకు జగన్‌తో సమస్యలేమీ లేవు. అయినా మాకున్న ఇబ్బందులు, రాజకీయ భవిష్యత్తు ఆలోచించి ఇటు వచ్చాం. ఇప్పుడు పార్టీ మారి తప్పు చేశామేమోననిపిస్తోంది.’ అని ఓ ఎమ్మెల్యే వాపోయారు.