ఆంధ్రప్రదేశ్‌

హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, మార్చి 22: అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత సూగూరు ఆంజనేయస్వామి దేవాలయంలో సతీమణి వసుంధర, ఇతర కుటుంబసభ్యులతో కలిసి బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వందలాది మంది కార్యకర్తలు వెంటరాగా ప్రచార రథంపై పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ముందుగానే నిర్ణయించిన ముహూర్త సమయం 11.10 గంటలకు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి గుణభూషణ్‌రెడ్డికి బాలకృష్ణ అందజేశారు. ఇక్కడి నుంచి బాలకృష్ణ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.