ఆంధ్రప్రదేశ్‌

బాబు తరఫున తమ్ముళ్ల నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, మార్చి 22: చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు తరఫున శుక్రవారం తెలుగు తమ్ముళ్లు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం కుప్పం మండలం లక్ష్మీపురం శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మూడు వేల మందితో బైక్ ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం 2.40 గంటలకు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆర్‌వో ఓబులేష్‌కు రెండు సెట్ల నామినేషన్లను గుడుపల్లి మాజీ ఎంపీపీ భవాని చంద్రశేఖర్, టీడీపీ ఇన్‌చార్జి పిఎస్ మునిరత్నం, పీకెఎం ఉడా చైర్మన్ సుబ్రహ్మణ్యంరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బీసి నాగరాజు, న్యాయవాది ఉదయ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి గోపీనాధ్ , సీఎం పీఎ మనోహర్ తదితరులు దాఖలు చేశారు. అయితే చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి వస్తారని ముందుగా సమాచారం అందింది. అయితే అనివార్యకారణాల వల్ల ఆమె కుప్పం రాకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహ పడ్డారు.
ఇదిలా ఉండగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి పలువురు నేతలు మాట్లాడుతూ గతంలోలా ఈసారి కూడా చంద్రబాబు నామినేషన్‌కు కుప్పం, గుడుపల్లి, శాంతీపురం, రామకుప్పం మండలాల ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడం శుభపరిణామమన్నారు. వచ్చేనెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీకి ఓటు వేసి చంద్రబాబునాయుడును భారీ మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో ఎంపీ శివప్రసాద్, వనె్నకుల క్షత్రియ రాష్ట్ర అధ్యక్షుడు సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాస్‌తో పాటు నాలుగు మండలాల జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.