ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థుల ఫీజులతో చెలగాటాలా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, మార్చి 22: విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చెలగాటాలు ఆడతారా.. అని మాజీ రాజ్యసభ సభ్యుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ మోహన్‌బాబు సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను నిరసిస్తూ శుక్రవారం తిరుపతి - మదనపల్లి రహదారిలో శ్రీ విద్యానికేతన్ వద్ద ఆయన విద్యార్థులతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని పలుసార్లు ముఖ్యమంత్రికి లేఖ రాశామన్నారు. విద్యార్థులు ఫీజుల గురించి మానసిక ఒత్తిడికి గురవుతుంటే ఏ విధంగా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోగా కొంతమంది ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తున్నట్లు చెప్పించడం ఏంటని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఎన్టీఆర్ సీఎంగా పేదలకు రూ. 2కిలో బియ్యాన్ని అందించారని, అలాంటి వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పేదొకటి.. చేసేదొకటని, మోసకారి మాటలు ఎక్కువరోజులు పనిచేయవన్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోతే న్యాయపరంగా కోర్టులను ఆశ్రయించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యానికేతన్ కళాశాలలో చదువుతున్న పలు తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు.