ఆంధ్రప్రదేశ్‌

సెజ్ భూములపై రైతులు చెప్పిందే చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, మార్చి 23: రాష్ట్రంలో సెజ్ భూములపై తాము అధికారంలోకి రాగానే రైతులతో కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సు మేరకు రైతులకు న్యాయం చేస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సెజ్ భూములు వైఎస్ జగన్‌కు చెందినవని ఆరోపణలు చేసి, అధికారంలోకి వస్తే భూములు తిరిగి ఇచ్చేస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచి తిరిగి సెజ్ రైతులపై కేసులు పెట్టారన్నారు. అందుకే తాము అధికారం చేపట్టిన వెంటనే రైతులతో సెజ్ భూములపై కమిటీ వేసి రైతు కమిటీ ఏది చెబితే ఆ విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. జన్మభూమి కమిటీలు హద్దుమీరి ప్రవర్తించాయన్నారు. ఇరవై రోజుల్లో మంచి రోజులొస్తున్నాయని జగన్ అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ నాయకుడు తన పదవికి రాజీనామా చేసే రోజులు రావాలన్నారు. నవరత్నాలు వైసీపీని గెలిపిస్తాయన్న జగన్ కాకినాడ ఎంపీ అభ్యర్థి వంగా గీత, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పెండెం దొరబాబులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా పలువురు నాయకులు జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పెద్దాపురం, కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తోట వాణి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పన మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరని పులవర్తి
పిఠాపురంలో జగన్ నిర్వహించిన ప్రచార సభలో టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే పులవర్తి నారాయణమూర్తి జగన్ సమక్షంలో పార్టీలోకి చేరతారని భావించారు. పిఠాపురం వచ్చిన పులవర్తి జగన్‌ను కలుసుకున్నారు. కానీ జగన్ కండువా వేసే సమయంలో మాత్రం ఆయన నిరాకరించారు. తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో పార్టీలో ఇంకా చేరేది లేదని ఆయన విలేఖరులకు వెల్లడించారు.
చిత్రం.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ప్రచార సభలో మాట్లాడుతున్న వైసీపీ అధినేత జగన్