ఆంధ్రప్రదేశ్‌

నేర చరిత్రపై వైఎస్ కుటుంబానికి పేటెంట్ హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 23: నేరచరిత్రపై పేటెంట్ హక్కులు వైఎస్ జగన్, ఆయన కుటుంబానికే ఉన్నాయని, తన అవలక్షణాలను ఎదుటివారికి ఆపాదించాలనుకోవటం ఆయన సంకుచిత స్వభావానికి నిదర్శనమని టీడీపీకి చెందిన శాసనసమండలి సభ్యులు వైవీబీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద శనివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న మూడు రోజుల్లో హత్యలు, దమనకాండకు టీడీపీ సిద్ధమైందని జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఓటమి భయంతో అభద్రతా భావానికి లోనై నిరాధార నిందారోపణలు చేస్తున్నారని ఖండించారు. అలాంటి కుయుక్తులు వైసీపీ ప్రయత్నాలు చేస్తూ తమపై బురద జల్లుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. మూడు తరాలుగా వైఎస్ కుటుబ చరిత్ర తెలిసిన వారికి ఇలాంటి అనుమానం రావటం సహజమన్నారు. జగన్ తాత వైఎస్ రాజారెడ్డి తాను పనిచేస్తున్న మైనింగ్ యజమాని వెంకట సుబ్బయ్యను హతమార్చి కబ్జా చేశారని, తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని పదవీచ్యుతుడ్ని చేసేందుకు హైదరాబాద్ పాతబస్తీలో వందలమంది ఊచకోతను ప్రేరేపించారని ఇప్పుడు జగన్ శవ రాజకీయాలతో పార్టీని స్థాపించి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఓటేస్తే పసుపు- కుంకుమ పంచుతారని, జగన్‌కు ఓటేస్తే తుడిచేస్తాడని ఈ విషయాన్ని ప్రజలే చెప్పుకుంటున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకృత్యాలు భరించలేక పంచభూతాలే ఆయన్ను కలిపేసుకున్నాయని దుయ్యబట్టారు. జగన్ నామినేషన్ సమర్పించిన అఫిడవిట్‌లో 27 పేజీలు ఆయన నేరచరిత్ర గురించి వివరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాష్ట్రంలో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారన్నారు. ఆ కేసుల సంగతి ఏంటో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలకు ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు.