ఆంధ్రప్రదేశ్‌

దేశంలో నెంబర్ వన్ మోసకారి చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, మార్చి 23: మాయల మరాఠి, మాటలతో స్వర్గం చూపే దేశంలోని ఏకైక నెంబర్ మోసకారి చంద్రబాబునాయుడు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకపాలన కొనసాగుతోందని, మరో 20 రోజులు ఓపిక పట్టాలని అవ్వలకు, ఆడపడుచులకు చెప్పండి మన జగనన్న సీఎం అవుతారని, అప్పుడు నవరత్నాల పథకాలతో ప్రతి పేదవాడికి మేలు జరుగుతుందని చెప్పాలని పలాస వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీకాకుళం జిల్లా, కాశీబుగ్గలో పలాస వైసీపీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం పార్లమెంటరీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లకు మద్దతుగా ప్రచారసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో మోడీకి వ్యతిరేకంగా ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ మోడీ ఇటీవల పర్యటనకు వచ్చినప్పుడు దేశంలోని అత్యంత నెంబర్‌వన్ దొంగ చంద్రబాబు అని వర్ణించిన విషయం గుర్తు చేశారు. ఆడపడుచులూ బాబుమాటలకు మోసపోవద్దు అని, మూడు వేల రూపాయలు ఇచ్చి మోసం చేయడానికి కుట్రపూనుతున్నారని దుమ్మెత్తిపోశారు. ఈ ఐదేళ్లుపాలనలో అరాచక పాలన కొనసాగిందని, వాటికి స్వస్తి పలికేందుకు అందరూ సంఘటితం కావాలని కోరారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తాను సీఎం అయిన వెంటనే ఉద్యోగాలను భర్తీ చేస్తానని, శాసనసభలో మొదట స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని తీర్మానం చేస్తామన్నారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, అభ్యర్థులు రెడ్డిశాంతి, ధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్ తదితరులు పాల్గొన్నారు.