ఆంధ్రప్రదేశ్‌

బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ.6.22 కోట్ల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 23: తిరుపతిలోని స్విమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి శనివారం దేశంలోని నలుమూలల నుంచి వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులు రూ.6,22,51,000 విరాళంగా అందజేశారు. అందులో ముంబైకి చెందిన వైఠల్ ల్యాబొరేటరీస్, వైఠల్ లైఫ్ కేర్ అధిపతి రాజీవ్ బజాజ్ రూ.5కోట్లు విరాళంగా అందచేసారు. అలాగే ముంబై నగరానికి చెందిన లలిత్ సేథీ రూ.1కోటి, తమిళనాడు రాష్ట్రం అరక్కోణం నగరానికి చెందిన వ్రజ్ సిమెంట్ క్యారీసస్ ఎల్‌ఎల్‌సీ తరపున ప్రభుప్రకాష్ రూ.20లక్షలు అందజేశారు. ముంబై నగరానికి చెందిన ఫిన్‌మేర్ అడ్వైజరీ కంపెనీ డైరెక్టర్ యాశిష్ రూ.2.51లక్షలు విరాళంగా అందించారు. విరాళాల దాతలు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్‌ను కలిసి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ పేదప్రజలకు అందిస్తున్న వైద్యసేవలను పరిగణలోకి తీసుకుని దాతలు విరాళాలు అందించడం అభినందనీయమన్నారు. దాతలు అందించిన విరాళాలను స్విమ్స్ అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు.