ఆంధ్రప్రదేశ్‌

నేటితో నామినేషన్ల పర్వానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 24: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు సోమవారంతో ముగియనుంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలకు ఈసారి ప్రధాన రాజకీయ పార్టీలు ఒంటరిగా బరిలో నిలవటంతో నామినేషన్ల సంఖ్య పెరిగింది. లోక్‌సభ నియోజకవర్గాలకు ఇప్పటివరకు దాఖలైన నామినేషన్ల వివరాలిలా ఉన్నాయి. అరకు నియోజకవర్గానికి 5, శ్రీకాకుళం-5, విజయనగరం-4, విశాఖపట్నం-4, అనకాపల్లి-5, కాకినాడ-9, అమలాపురం-4, రాజమండ్రి-8, నరసాపురం-7, ఏలూరు-3, మచిలీపట్నం-7, విజయవాడ-6, గుంటూరు-7, నరసరావుపేట-3, బాపట్ల-5, నంద్యాల-13, కర్నూలు-7, అనంతపురం-4, హిందూపూర్-5, కడప-5, నెల్లూరు-6, తిరుపతి-7, రాజంపేట-8, చిత్తూరులో ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు అత్యధికంగా నంద్యాలలో 13 మంది నామినేషన్లు వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. ముహూర్త బలం బాగుండటంతో గత శుక్రవారం అధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 26, 27తేదీల్లో పరిశీలన, అభ్యంతరాలు, ఉపసంహరణల అనంతరం 28న అధికారులు తుది జాబితాను ప్రకటిస్తారు.