ఆంధ్రప్రదేశ్‌

ఫ్యాక్షనిస్టు చెల్లెలు మాదిరిగానే షర్మిల మాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు గురించి వైకాపా అధినేత జగన్ సోదరి షర్మిల మాట్లాడిన మాటలు కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు చెల్లెలు మాటల్లానే ఉన్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ అన్నారు. సోమవారంఆమె విలేఖర్లతో మాట్లాడుతూ ఎంత ప్యాకేజి ఇస్తే ఎన్నికల ప్రచారానికి వచ్చారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో ఏర్పాటైన కియా, అశోక్ లేలాండ్, ప్యాక్స్ కాన్ ఏషియన్ పెయింట్స్‌తో పాటు మంగళగిరిలో ఏర్పాటైన 40 ఐటీ కంపెనీలు తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆమె తెలిపారు. మీ నాన్న వైఎస్‌ఆర్ హయాంలో రాష్ట్రానికి వచ్చిన వోక్స్ వ్యాగన్‌ను తిప్పి పంపించిన ఘనత ఆయనదేనని చెప్పారు, ఆయన హయాంలో లంచాలు ఇవ్వలేక పారిశ్రామిక వేత్తలు తరలి వెళ్లిపోయారని గుర్తుచేశారు. మహానేత పాలనలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ చరిత్ర, దళితుల భూములు ఆక్రమించిన చరిత్ర వైఎస్‌ఆర్ కుటుంబానిదేనని ఆమె అన్నారు.