ఆంధ్రప్రదేశ్‌

అరకులో ఇండోనేసియా అగ్నిపర్వతం బూడిద నిక్షేపాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 28: విశాఖ జిల్లా గిరిజన ప్రాంతం అరకులో ఇండోనేసియాకు చెందిన అగ్నిపర్వత బూడిద నిక్షేపాలు ఉన్నాయి. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. దాదాపు పదేళ్ల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాల్లో ఈ విషయం వెలుగుచూసింది. దాని ప్రాధాన్యత తెలియచేస్తూ పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో ఉత్తర భాగాన తోబా సరస్సు ఉంది. ఆ ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద అగ్నిపర్వతం ఉండేది. దాదాపు 74 వేల సంవత్సరాల క్రితం ఆ అగ్ని పర్వతం బద్దలై భారీగా లావా, బూడిద ఎగసిపడింది. దాదాపు 22 వేల చదరపు కిలోమీటర్ల మేర వివిధ ప్రాంతాలను పూర్తిగా నాశనం చేయగా, దీని నుంచి వెలువడిన బూడిద అనేక ప్రాంతాలకు, దేశాలకు విస్తరించింది. దక్షిణాసియలో చాలా ప్రాంతాల్లో 15 అడుగుల మేరకు బూడిద పేరుకుపోయింది. దీని ప్రభావం ఇండియా, పాకిస్తాన్, తదితర ప్రాంతాల్లో కూడా పడింది. ఈ సమయంలో బూడిదతో నిండిన వాతావరణంలోకి సూర్య కిరణాలు ప్రవేశించలేక చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్ మేర పడిపోయాయి. అందుకే ఆ సమయాన్ని అగ్నిపర్వత శీతాకాలంగా పరిశోధకులు వ్యవహరిస్తారు. భూగోళం ఏర్పడిన తరువాత ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన కాలాన్ని కచ్చితంగా అంచనా వేసిన తొలి అగ్నిపర్వతం ఇదే. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులను ఈ విస్ఫోటనం తెలియచేస్తుంది. దీంతో ఈ అగ్ని పర్వతానికి ప్రాధాన్యత చాలా ఎక్కువ.
విస్ఫోటనం వల్ల తొలగిపోయిన పర్వత భాగంలో తరువాతి కాలంలో సరస్సు ఏర్పడింది. దానినే తోబా సరస్సుగా వ్యవహరిస్తారు. ఇది 100 కిలోమీటర్ల పొడవు, 30 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అంటే ఎంత పెద్ద బిలం అగ్నిపర్వతం వద్ద పేలుడు వల్ల ఏర్పడిందో? ఎంత లావా, బూడిద వెలువడిందో ఊహించవచ్చు. అలా ఇండోనేషియా అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద నదీ లోయల వద్ద మాత్రం నిక్షేపాలుగా ఏర్పడింది.
బంగళాఖాతంలో, విశాఖ జిల్లా అరకు, కర్నూలు జిల్లా సాగిరేలులో ఉన్నట్లు జిఎస్‌ఐ, కొంతమంది పరిశోధకులు గుర్తించారు. అరకులోని పాతాళ గెడ్డ వద్ద, రైల్వే స్టేషన్ రోడ్డులో ఈ బూడిద నిక్షేపాలను చూడవచ్చు. పాతాల గెడ్డ వద్ద 100 అడుగుల పొడవు, ఒక మీటరు వెడల్పులో ఈ బూడిద నిక్షేపాన్ని చూడవచ్చు. రైల్వే స్టేషన్ వద్ద 20 అడుగుల మేర 15 సెంటీమీటర్ల వెడల్పులో ఉంది. నేటికీ దీనిని పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఈ ప్రాంతాలను తిరుపతి సమీపంలోని శిలాతోరణం తరహాలో భౌగోళిక వారసత్వ సంపదగా ప్రకటించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే వీలు ఉన్నా, ఆ మేరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.