ఆంధ్రప్రదేశ్‌

అన్ని వర్గాలకు సామాజిక న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కొన్ని సామాజిక వర్గాలకే పెద్దపీట వేస్తున్నారని, బీజేపీకి అధికారంలోకి వస్తే అన్ని కులాలు, వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తామని, ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం లేనిచోట నామినేటెడ్ పోస్టుల్లో సరైన ప్రాధాన్యత ఇస్తామని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ప్రకటించారు. విజయవాడలో మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ప్రస్తుత ఎన్నికల్లో మాలలకు 11, మాదిగలకు 18, బీసీలకు 24, కాపులకు 36, రెడ్లకు 23, కమ్మ 15, వైశ్య 9, బ్రాహ్మణ 4, క్షత్రియ 4, ముస్లింలకు 1, ఎస్టీలకు 7 అసెంబ్లీ సీట్లు కేటాయించామన్నారు.
మేనిఫెస్టో ప్రధానాంశాలు
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్పు, ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు ద్వారా వెనుకబడిన జిల్లాలకు అధిక ప్రాధాన్యత. ఎస్సీ, ఎస్టీలపై అక్రమ కేసులు తొలగింపు, కోటి రూపాయల వరకూ ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం మంజూరు, షెడ్యూల్ కులాల వర్గీకరణ, రైతులకు ఒకేసారి రుణమాఫీ, 16 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం, వ్యవసాయ రంగంతో ఉపాధి హామీ పథకం అనుసంధానం, వ్యవసాయ ఉపకరణాలపై 75 శాతం రాయితీ, బిందు సేద్యంపై 90 శాతం రాయితీ, ప్రజావైద్యం, ఆరోగ్యానికి పెద్దపీట, జనరిక్ మందులకు ప్రోత్సా హం, 108 సేవలు మరింత విస్తరణ, డిగ్రీ, పీజీవిద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, పాఠశాల స్థాయి నుంచి యోగా, వ్యక్తిత్వ వికాసాల తరగతులు ఏర్పాటు, మహిళా సంక్షేమానికి ప్రాధా న్యం, ఫ్యామిలీ కోర్టుల బలోపేతం, మత్స్యకారుల సంక్షేమం, కులవృత్తులకు రక్షణ, చేనేత కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, వివాహ బహుమతి, మండల స్థాయిలో అన్ని హంగులతో ఆడిటోరియాలు, సౌర విద్యుత్ పెంపుదలకు కృషి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సీపీఎస్ రద్దు, అన్నింటినీ మించి నీటి పారుదలకు అధిక ప్రాధాన్యత, టీడీపీ నిర్లక్ష్యం చేసిన వివిధ సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ చేపడతామన్నారు. రాజధాని అమరావతిని అన్ని హంగులతో తీర్చిదిద్ది, అభివృద్ధి చేస్తూనే రియల్ ఎస్టేట్ వ్యాపారంగా కాకుండా అభ్యర్థించిన వారి భూములను వెనక్కి ఇస్తామన్నారు. అన్ని ప్రధాన పట్టణాల సమగ్రాభివృద్ధికి చర్యలు, శాంతి భత్రల పెంపునకు చర్యలు, పర్యావరణ పరిరక్షణకు గ్రామీణ పట్టణాల అభివృద్ధికి కృషి , విశాఖ, గుంటూరు, విజయవాడ, తిరుపతి ప్రాంతీయ కేంద్రాలుగా అభివృద్ధి, ఎక్సైజ్ విధానం సమూలంగా మార్పు, పారిశ్రామిక కేంద్రంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు, హిందూమత పరిరక్షణ, వ్యాప్తికి అవసరమైన చర్యలు, అర్చకులకు వైద్య సౌకర్యంపై బీమా సదుపాయంతో హెల్త్ కార్డులు, పారిదర్శక అవినీతి రహిత పాలన, ఎక్సైజ్ శాఖ నుంచి గీత కల్లుకు మినహాయింపు, బీమా, దోభీ ఘాట్ల నిర్మాణం, ఉచిత విద్యుత్, 60 ఏళ్లు నిండిన వృద్ధులకు నెలకు 3000 పింఛను, 1000 కోట్లతో యూత్ ఎంపవర్‌మెంట్ పథకం, భూముల రికార్డుల ఆధునీకరణకు చర్యలు చేపడతామన్నారు.

చిత్రం.. బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ జీవీఎల్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, తదితరులు