ఆంధ్రప్రదేశ్‌

సవ్యంగా లేని నామినేషన్లు తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు/ఒంగోలు, మార్చి 26: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం మంగళవారం ముగిసింది. చిత్తూరు పార్లమెంట్ నియోజక వర్గానికి 10 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా అందులో ఇద్దరి నామినేషన్లను రిటర్నింట్ అధికారి ప్రద్యుమ్న తిరస్కరించారు. రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 20 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా అందులో ఏడు గురు అభ్యర్థుల నామినేషన్లను నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి గిరీష తిరస్కరించగా, మరో అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. మంగళవారం అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్ల సమక్షంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం కొనసాగింది. చిత్తూరు పార్లమెంట్ నియోజక వర్గంలో బి. రాజగోపాల్ (కాంగ్రెస్ డమ్మి) ఎన్ . రెడ్డమ్మ వైకాపా డమ్మి అభ్యర్థుల నామినేషన్లల్లో పార్టీలకు సంబంధించిన వ్యక్తులుగా సరైన ఆధారాలు లేకపోవడంతో వారి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. రాజంపేట పార్లమెంట్ నియోజక వర్గానికి 20 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా అందులో సి సుజనాదేవి, అల్త్ఫా బాషా స్వతంత్ర అభ్యర్థులు చిదంబర్ రెడ్డి (బిసి యునైటెడ్ ఫ్రంట్), కె తేజేశ్వరి (టీడీపీ), ఎన్ రాజు, ఎస్ రచన (అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ), జయపాల్ రెడ్డి (ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి), కృష్ణయ్య (స్వతంత్ర) అభ్యర్థుల నామినేషన్లను అధికారులు వివిధ కారణాలతో తిరస్కరించారు.కాగా వెంకటరమణ (దళిత బహుజన పార్టీ) అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకొన్నారు. ఇదిలావుండగా చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గంలో నాలుగు నామినేషన్ల తిరస్కరించినట్టు అధికారులు చెప్పారు. కాగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు లోక్‌సభ సెగ్మెంట్‌కు నాలుగు, బాపట్ల లోక్‌సభ సెగ్మెంట్‌లో రెండు నామినేషన్లు తిరస్కరించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పారు. అదే విధంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 63 నామినేషన్లు తిరస్కరించినట్టు అధికారులు ప్రకటించారు.
తూర్పు గోదావరిలో...
కాకినాడ: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో నామినేషన్ల పరిశీలన మంగళవారం పూర్తయ్యింది. ఈసందర్భంగా పలు నామినేషన్లను అధికార్లు తిరస్కరించారు. జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు గాను మొత్తం 50 నామినేషన్లు దాఖలు కాగా 12 తిరస్కరించారు. అలాగే 19 అసెంబ్లీ స్థానాలకు 317 నామినేషన్లు దాఖలుకాగా 62 తిరస్కరించారు. జిల్లాలోని కాకినాడ లోక్‌సభ స్థానానికి 20 నామినేషన్లు దాఖలుకాగా, నాలుగు తిరస్కరించగా, 16 పోటీకి అర్హమైనవిగా తేల్చారు. అమలాపురం లోక్‌సభ స్థానానికి 13 నామినేషన్లు దాఖలుకాగా, మూడింటిని తిరస్కరించారు. 10 పోటీకి అర్హమైనవిగా తేల్చారు. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానానికి 17 నామినేషన్లు దాఖలుకాగా, ఐదు తిరస్కరించారు. 12 నామినేషన్లు పోటీకి అర్హమైనవిగా తేల్చారు. 19 అసెంబ్లీ స్థానాలకు 319 నామినేషన్లలో 62 తిరస్కరించారు. 257 పోటీకి అర్హమైనవిగా నిర్ధారించారు.
పశ్చిమ గోదావరిలో...
పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేషన్ల పరిశీలన అనంతరం పలు నామినేషన్లు తిరస్కరించారు. ఏలూరు లోక్‌సభ స్థానానికి 14 నామినేషన్లు దాఖలుకాగా, రెండు తిరస్కరించారు. 12 పోటీకి అర్హమైనవిగా నిర్ధారించారు.
నరసాపురం లోక్‌సభ నియోజకర్గానికి 20 నామినేషన్లు దాఖలుకాగా, మూడు తిరస్కరించారు. 17 పోటీకి అర్హమైనవిగా నిర్ధారించారు. ఇక 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 234 నామినేషన్లు దాఖలుకాగా, 47 తిరస్కరించారు. 187 నామినేషన్లు పోటీకి అర్హమైనవిగా నిర్ధారించారు.