ఆంధ్రప్రదేశ్‌

మోదీని నమ్మి మోసపోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు/కడప, మార్చి 26: దేశానికి నరేంద్ర మోదీ ఎంతో చేస్తారని ఊహించి ఐదేళ్ల క్రితం అధికారం అప్పగిస్తే ప్రజలను ఆయన మోసం చేశారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలసి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు పట్టణం, కడప పట్టణంలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలు, సభల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో దేశం నష్టపోయిందన్న అభిప్రాయంతో ప్రజలు నరేంద్ర మోదీకి పట్టంకట్టారని అన్నారు. అయితే ప్రజల ఆవేదన, ఆశలను గుర్తించకుండ ప్రధానమంత్రి స్వప్రయోజనాల కోసమే పనిచేశారని ఆయన మండిపడ్డారు. బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన వారిని పట్టించుకోలేదని, పెద్దనోట్లు రద్దుచేసి బడా బాబులకు మేలు చేశారన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సదుపాయాలను కల్పించారే గానీ పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఒకటి రెండు పథకాలు చెప్పుకోవడానికే తప్ప అవి దేశ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. ప్రధానంగా దేశం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఆయన ఏమీ చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానమంత్రికి పట్టలేదని, బడా పారిశ్రామిక వేత్తల గురించి ఆలోచించడానికే సమయం లేదన్నట్లుగా ఆయన పాలన కొనసాగిందన్నారు. మరోమారు ప్రజలు నరేంద్ర మోదీకి పట్టం కట్టవద్దని విజ్ఞప్తి చేశారు. మోదీ అధికారంలోకి రాకుండా నివారించేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్‌డీఏకు ఎదురుగాలి వీస్తోందని ఆయన అన్నారు.
భారతదేశం అంతా ఒక్కటేనని, ఏప్రాంతంలో ఉన్నా, ఏం తింటున్నా అందరం భారతీయులమని అబ్దుల్లా అన్నారు. అయితే దేశాన్ని ప్రాంతాలవారీగా, మతాల వారీగా విడగొట్టాలని కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆయన పరోక్షంగా నరేంద్రమోదీని ఉద్దేశించి విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ ఏకమై నడిచారని, కుల, మతాల ప్రస్తావన రాలేదని అన్నారు.
ఎవరు ముస్లింలు, ఎవరు దళితులంటూ రాజకీయం నడుపుతున్నారని విమర్శించారు. చివరకు తీవ్రవాదాన్ని, దేశభద్రతను కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పార్టీ తనను ముఖ్యమంత్రిని చేస్తే రూ.1500కోట్లు ఇస్తానని అప్పట్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారన్నారు. అంత డబ్బు అతనికి ఎలా వచ్చిందని ఫరూక్ ప్రశ్నించారు.

చిత్రం.. కడప నగరంలో మంగళవారం నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతున్న
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, పక్కన చంద్రబాబు