ఆంధ్రప్రదేశ్‌

నిప్పుల కొలిమిగా రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం/కడప, మార్చి 22 : రాయలసీమ జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండ తీవ్రతకు సీమ జిల్లాల్లో రోడ్లు నిప్పులకొలిమిని తలపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. కర్నూలు జిల్లా అవుకు, కడప జిల్లా చిట్వేలు మండలాల్లో మంగళవారం 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడబెబ్బకు ఐదుగురు మృతి చెందారు. కడప జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లా తెనాలిలో ఒకరు మృతి చెందారు. అనంతపురం జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 41.3 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా జిల్లా కేంద్రంలో 42.7 డిగ్రీల సెల్సియస్, అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 45.2, కర్నూలు జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 42.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా అవుకులో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కడప జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 41.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా అత్యధికంగా చిట్వేలు మండలంలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరు జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 40.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా తిరుపతిలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సైతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పుట్టపర్తిలో 45, కర్నూలు జిల్లాలోని ప్రమఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలంలో 45.4, మహానందిలో 44.7, కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠంలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో భక్తులు బెంబేలెత్తిపోయారు. కడప జిల్లా రామాపురం మండలం వంగిమళ్లకు చెందిన విశ్రాంత ఎస్‌ఐ రసూల్‌ఖాన్ (80), లక్కిరెడ్డిపల్లె మండలం రాచపల్లె వంకగడ్డకు చెందిన నాగరాజు (45) ఎండతీవ్రతకు తాళలేక సొమ్మసిల్లడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. అలాగే దువ్వూరు మండలం చినసింగనపల్లికి చెందిన భాగ్యమ్మ (47) మంగళవారం పొలం వెళ్లి ఎండవేడిమి భరించలేక ఇంటికి వచ్చింది. వచ్చీరాగానే నీళ్లు తాగి నిద్రించింది. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు ఆమెను పరిశీలించగా అప్పటికే కన్నుమూసింది. కడప జిల్లాలో భానుడి తమ విశ్వరూపాన్ని చూపుతున్నాడు. మంగళవారం జిల్లా నిప్పుల కొలిమిని తలపించింది. జాతీయస్థాయిలో గరిష్టంగా కడపజిల్లా చిట్వేలులో మంగళవారం 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండతీవ్రతకు జనం గజగజ వణికిపోయారు. గుంటూరు జిల్లా వేసవి తాపానికి మతి స్థిమితం లేకుండా వీధుల్లో సంచరించే అనాధ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లూరుకు ఎక్కడి నుండో వచ్చి పిచ్చి చేష్టలతో వీధుల్లో తిరుగుతూ మతిస్థిమితంలేని వ్యక్తి సోమవారం చినపులివర్రు డొంకలోకి వెళ్లి అక్కడ మురుగు డ్రైయిన్‌వద్దకు వచ్చినట్లు వ్యవసాయ కూలీలు తెలిపారు.

రమే పరిమితం చేయాలని సూచించారు. వికలాంగులకు, వయో వృద్ధులకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 30వ తేదీ వరకు కేవలం మధ్యాహ్నం మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు.