ఆంధ్రప్రదేశ్‌

నవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఒంటిమిట్ట కోదండ రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఏప్రిల్ 12: కడప జిల్లా ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామయ్య ఆలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కోసం ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ముఖద్వారంతో పాటు రంగమండపాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జాంబవంతునిచే ఏకశిలపై సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులను ప్రతిష్టించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. వనవాసం సమయంలో సీతారామలక్ష్మణులు ఒంటిమిట్ట మీదుగా వెళ్లినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఘన చరిత్ర కలిగిన ఒంటమిట్ట శ్రీ కోదండ రామాలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు లక్షల్లో భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ విభాగాలకు చెందిన టీటీడీ అధికారులు ఒంటిమిట్టలో తిష్టవేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. టీటీడీ ఈఓ సింఘాల్ ఒంటిమిట్టలో పర్యటించి శ్రీరామనవమి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అభివృద్ధి పనులు, వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఆలయం చుట్టూ విద్యుద్దీప కాంతులతో వివిధ రకాల దేవతామూర్తుల చిత్రాలను ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ ఉన్న మాడావీధులను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కల్యాణం రోజు లక్షల్లో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అదనపు వసతి, భోజనం, షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు.