ఆంధ్రప్రదేశ్‌

ఓటరు తీర్పు నిక్షిప్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 12: రాష్ట్రంలో రాక్షసపాలనకు ప్రజలు చరమగీతం పాడారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు గత అయిదేళ్లుగా అనుభవిస్తున్న కష్టానికి సరైన ప్రతీకారం తీర్చుకున్నారన్నారు. రాష్ట్రంలో గురువారం నాటి పోలింగ్ సరళి, ప్రజల చైతన్యం చూసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రతి చిన్న విషయానికీ సహనం కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వ సొమ్ముతోనే ప్రజల ఓట్లను కొనుగోలు చేయాలని భావించిన చంద్రబాబు, అందుకు అనుగుణంగానే పనిచేశారన్నారు. అయితే విజ్ఞత కలిగిన ప్రజానీకం మాత్రం చంద్రబాబు శైలిని అర్ధం చేసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారన్నది పోలింగ్ ద్వారా స్పష్టమైందన్నారు. ఎన్నడూ లేనంతగా ప్రజలు చైతన్యంతో ఓటింగ్‌కు హాజరై ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను బహిర్గతం చేశారన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారన్నారు. అధికారులను భయపెట్టి తనకు అనుకూలంగా వ్యవహరించేలా చూశారని, చంద్రబాబుకు తిరిగి అధికారం ఇస్తే ఏం జరుగుతుందో అర్ధం చేసుకున్నారన్నారు. ఇదే సందర్భంలో స్వతంత్ర సంస్థలైన ఈసీపై కూడా చంద్రబాబు విమర్శలు చేయడం చూస్తే చంద్రబాబు ఓటమిని ఊహించే ఉంటారన్నది స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎన్‌టీఆర్ బయోపిక్ పేరిట రెండు చిత్రాలు విడుదలై, అందులో చంద్రబాబును హీరోగా చూపితే హర్షించిన ఆయన, వర్మ చిత్రాన్ని మాత్రం విడుదల కాకుండా అడ్డుకున్నారన్నారు. ఇక రాష్ట్రంలో మంత్రులు పెద్ద ఎత్తున ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు, శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా ఓట్ల కొనుగోలు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఓటమి భయంతోనే వీరంతా ప్రజలతో సంబంధం లేకుండా ఓట్లు వేయించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారన్నారు. ఈ అక్రమాలకు ప్రజలు చరమగీతం పాడారని, మే 23 తరువాత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.