ఆంధ్రప్రదేశ్‌

మత్స్యకారులకు రూ. 10 వేల పరిహారమివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏప్రిల్ 15 నుండి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధం విధించినందున ఈ నిషేధ కాలంలో మత్స్యకారులకు పరిహారంగా రూ. 10వేలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లతో చేపల వేట చేసే వారికి పరిహారంగా ఒక్కొక్కరికి రూ. 4వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వారి వారి బ్యాంకు అకౌంట్లకు నగదు బదిలీ చేస్తుందన్నారు. అయితే రికార్డులు సరిగ్గా లేకపోవడం, ఆధార్, రేషన్‌కార్డులు బ్యాంక్ అకౌంట్లతో అనుసంధానం కాలేదనే సాకుతో గత సంవత్సరం కొన్ని వేల మందికి ఆర్థిక సహకారం అందలేదన్నారు. ఈ సంవత్సరం అదే పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. చేపలు పట్టే వారితోపాటు ఆ చేపలు అమ్ముకుని బతికే కుటుంబాలకు కూడా అదే పరిహారాన్ని వర్తింపచేయాలని మధు డిమాండ్ చేశారు.