ఆంధ్రప్రదేశ్‌

ఓటర్ల తిరుగు ప్రయాణానికి 500 ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌క వచ్చిన ఓటర్లు తిరిగి తమతమ గమ్యస్థానాలకు వెళ్లేందుకుగాను ఏపీఎస్ ఆర్టీసీ ఆదివారం 500 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల నుంచి ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపనున్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్ కోసం వీటి వివరాలను ఇప్పటికే రిజర్వేషన్ సిస్టంలో పొందుపరిచారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వి సురేంద్రబాబు శనివారం ఈ ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై సమీక్ష జరిపారు. హైదరాబాద్ నగరానికి 244 బస్సులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరుకు 193 బస్సులు, చెన్నై నగరానికి 50 బస్సులు కేటాయించారు. హైదరాబాద్ నగరానికి విజయవాడ నుంచి 68, కర్నూలు నుంచి 39, గుంటూరు నుంచి 38, పశ్చిమ గోదావరి నుంచి 25, నెల్లూను నుంచి 18, ఒంగోలు నుంచి 17, కడప నుంచి 14, అనంతపురం నుంచి 12, మిగిలిన జిల్లాల నుంచి మూడు నుంచి ఐదు సర్వీసులు చొప్పున నడపనున్నారు. ఇక బెంగళూరుకు విజయవాడ నుంచి 13, గుంటూరు నుంచి 10, కర్నూలు నుంచి 28, అనంతపురం నుంచి 20, చిత్తూరు నుంచి 70, కడప నుంచి 29, నెల్లూరు నుంచి 19, ఒంగోలు నుంచి ఐదు సర్వీసులు, చెన్నైకు విజయవాడ నుంచి 10, గుంటూరు నుంచి 7, ఒంగోలు నుంచి 4, నెల్లూరు నుంచి 8, చిత్తూరు నుంచి 6, కడప నుంచి 8, అనంతపురం నుంచి 4, కర్నూలు నుంచి 2 నడుపుతున్నారు. అదే విధంగా ఆ తర్వాత రోజుల్లో రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను నడపనున్నారు.