ఆంధ్రప్రదేశ్‌

ఏపిలో లేబర్ కోర్టు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో లేబర్ కోర్టు(ట్రిబ్యునల్) ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు సమస్యలు వచ్చినప్పుడు లేబర్ కోర్టు సత్వర న్యాయం జరగడం లేదనే అభిప్రాయం కార్మికుల్లో ఉందన్నారు. దేశ వాప్తంగా 22 ట్రిబ్యునల్స్ ఉంటే 22 వేల కేసులు పెండింగ్‌లోఉన్నాయన్నారు. సంవత్సరానికి 2,300 కేసులు మాత్రమే పరిష్కరించినట్టు చెప్పారు. కార్మికులకు సత్వర న్యాయం కోసం లేబర్‌కోర్టులను మరింత బలోపేతం చేయడం, వౌలిక సదుపాయాలు కల్పించడం, సిబ్బందిని పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నట్టు దత్తాత్రేయ పేర్కొన్నారు. కార్మికులకు సమస్యలు పరిష్కారానికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటామన్నారు. పారదర్శకత, జవాబుదారితనం పెరిగేలా చర్యలు తీసుకుంటామనని మంత్రి తెలిపారు. కార్మికులకు సంక్షేమానికి ప్రధాని మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని బండారు చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలేక ఇప్పటివరకు లేబర్ కోర్టు లేని రాష్ట్రాల్లోనూ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కార్మికులకు సమస్యలు ఏర్పడినప్పుడు వారికి న్యాయ సహాయం అందిచే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరుగుతున్న ఘటనలపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు మాట్లాడ్డానికి నిరాకరిస్తూ హెచ్‌సియూ అంశం కేంద్ర మానవ వనరులశాఖ పరిధిలోని అంశమన్నారు.