ఆంధ్రప్రదేశ్‌

మరోసారి బట్టబయలైన ఈసీ వైఫల్యాలు: వర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: ఇప్పటి వరకు ఎన్నో ఎలక్షన్ కమిషన్లను చూసినప్పటికీ ఇంత ఘోరంగా విఫలమై అపకీర్తిని మూటకట్టుకున్న ఎలక్షన్ కమిషన్ మరొకటి లేదని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ధ్వజమెత్తారు. గురువారం రెండు అంశాలపై ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్‌లో ఎలక్షన్ ముగిసిన తరువాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను నిర్ణీత సమయంలో నిర్దేశించిన ప్రదేశంలో అప్పగించకుండా అక్కడి రిటర్నింగ్ ఆఫీసర్ 24 గంటల పాటు తన ఇంట్లో పెట్టుకుని ఆ తరువాత మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో అప్పగించారని అన్నారు. పైగా అక్కడి రిటర్నింగ్ ఆఫీసర్ తన వివరణలో బాగా అలసిపోయి నిద్రపోవడం వలన సకాలంలో అప్పగించలేకపోయానని చెప్పడం ఎలక్షన్ కమిషన్ వైఫల్యానికి అద్దం పడుతుందని వర్ల మండిపడ్డారు. కడప జిల్లా కోడూరు అసెంబ్లీ నియోజకర్గ పరిధిలో మరో దారుణం చోటు చేసుకుందని, అక్కడ బూత్ నెం 21లో 331 ఓట్లకు గాను 370 ఓట్లు పోలవడం విడ్డూరంగా ఉందని, రిగ్గింగ్ జరిగిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. ఈ రెండు కేసులపై సమగ్ర విచారణ జరిపి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్ చేశారు.