ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు వ్యాఖ్యలపై 23న ఐఏఎస్‌ల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఐఏఎస్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ఐఎఎస్‌లు మూకుమ్మడిగా నిరసన తెలియచేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈనెల 23న విజయవాడలో ఏపీ ఐఏఎస్‌లు భేటీ కానున్నారు. ఏపీలో ఐఏఎస్‌ల సంఘానికి చెందిన కొందరు సీనియర్ ఐఏఎస్‌లు ఇందుకోసం సంతకాల సేకరణ చేస్తున్నారు. భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును నిరసిస్తూ ఒక తీర్మానం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం, ఏపీ ఎన్నికల కమిషనర్ ద్వివేదిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కోర్టుల్లో కేసులు ఉన్న సుబ్రమణ్యంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగానే నియమించిందని చంద్రబాబు చెప్పడంపై ఐఏఎస్‌లు తప్పుబడుతున్నారు. రాజకీయాల్లో తానే సీనియర్ నేతగా చెప్పుకునే చంద్రబాబు బ్యూరోక్రాట్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఐఏఎస్‌ల ఆత్మాభిమానాన్ని
దెబ్బతీసేవిధంగా ఉన్నాయని, దీంతో తాము మానసిక ఆందోళన చెందుతున్నామని వారు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల కమిషనర్ ద్వివేదిపై చంద్రబాబు బెదిరింపు ధోరణితో వ్యవహరించడం ముఖ్యమంత్రి హుందాతనాన్ని తగ్గించినట్లుగా ఉందని అంటున్నారు. చంద్రబాబుపై నిరసన వ్యక్తం చేయడానికి అనుకూల, ప్రతికూల వర్గాలుగా విడిపోయనట్లు తెలుస్తోంది. బాహాటంగా ముందుకు వస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని కొందరు ఐఏఎస్‌లు మధనపడుతున్నారు. ఏదిఏమైనా ఈ నెల 23న ఐఏఎస్‌లు భేటీ కావాల్సిందేనని మరికొందరు పట్టుబడుతున్నారు.