ఆంధ్రప్రదేశ్‌

38 మున్సిపాలిటీల్లో మాస్టర్‌ప్లాన్ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఏప్రిల్ 20: రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉన్న 38 మున్సిపాలిటీల్లో 20 సంవత్సరాలకు కావాల్సిన సౌకర్యాల కల్పనపై మాస్టర్‌ప్లాన్ తయారుచేస్తున్నట్లు రాయలసీమ రీజనల్ టౌన్‌ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ శైలజ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే అనేక మున్సిపాలిటీల్లో టౌన్‌ప్లానింగ్ కాలపరిమితి ముగిసిందన్నారు. టౌన్‌ప్లానింగ్ ప్రణాళిక ముగిసిన మున్సిపాలిటీల్లో ఆదోని కూడా ఒకటన్నారు. రాబోయే 20 సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పట్టణాల్లో ప్రజల సమస్యలు, తాగునీరు, రోడ్లు తదితర సమస్యలు, ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాలపై మాస్టర్‌ప్లాన్లు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అయితే గత నెల 30వ తేదీ నాటికే మాస్టర్‌ప్లాన్లు ప్రభుత్వానికి పంపాల్సి ఉండేదని, కాని అనేక కారణాల వల్ల పంపలేదన్నారు. ఇప్పటికే 28 నుంచి 30 మున్సిపాలిటీల్లో మొదటి స్టేజీ డ్రాప్ట్ మాస్టర్‌ప్లాన్ తయారుచేసి పంపించామన్నారు. ప్రజలు, వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి వారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు. మాస్టర్‌ప్లాన్ అప్రూవల్ అయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వీలవుతుందన్నారు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం తిరుపతి, కడప, కర్నూలు తదితర పట్టణాల్లో రోడ్ల వెడల్పు కార్యక్రమం కొనసాగించామని అన్నారు. అయితే రోడ్డు వెడల్పులో కొన్ని సమస్యలు వస్తున్నాయని దీనికి ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా న్యాయమైన చిక్కులు పరిష్కరించాల్సి ఉంటుందని, అందుకు ముందుగా నోటీసులు అందజేసి ఆక్రమణలు ఉంటే తొలగిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో నష్టపోయే వారికి నష్టపరిహారం చెల్లించే విధానం అమలు చేస్తే విస్తరణ కార్యక్రమం త్వరితగతిన చేపట్టేందుకు వీలవుతుందన్నారు. మాస్టర్‌ప్లాన్ తయారు చేసే పనిని ప్రాణాళికశాఖకు అప్పగించినట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత జనాభా రవాణా అవసరాలు పెరుగుతున్న వచ్చే 20 ఏళ్లలో తలెత్తనున్న సమస్యలను అధిక మించటానికే మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తున్నామని అన్నారు. అందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో రాయలసీమలోని అన్ని మున్సిపాలిటీల్లో మాస్టర్‌ప్లాన్ మొదటి దశ డ్రాఫ్ట్ తయారుచేసి పంపుతామన్నారు. ఈ పనిని పలు నైపుణ్య సంస్థలకు అప్పగించినట్లు ఆమె స్పష్టం చేశారు.
చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న రాయలసీమ రీజనల్ టౌన్‌ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ శైలజ