ఆంధ్రప్రదేశ్‌

సిబ్బంది కుదింపును అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: ఏపీఎస్ ఆర్టీసీలో దొడ్డి దారిన సిబ్బందిని కుదించే చర్యలను అడ్డుకుంటామంటూ గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. నష్టాలకు కార్మికులు కారణం కాదని ఒక వైపు చెబుతూనే మరో వైపు సిబ్బందిని కుదించి నష్టాలను తగ్గించాలనుకునే ఆలోచనలను విరమించుకోవాలన్నారు. సిబ్బందికి సంబంధించి పదోన్నతులు, బదిలీలు కారుణ్య నియామకాలు అన్నింటికీ ఎన్నికల కోడ్ అని చెబుతూ, జీపులు, కార్లకు ఉన్న ఆర్టీసీ డ్రైవర్లను తొలగించి మే నెల ఒకటో తేదీ నుంచి ప్రైవేట్ వారిని నియమించుకోవాలంటూ ఆదేశాలు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తూ యాజమాన్యానికి లేఖ రాసామన్నారు. జాయింట్ కమిటీతో సమ్మె విరమణ సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు 2013 వేతనాల సవరణకు సంబంధించి చెల్లించాల్సిన 80 శాతం బకాయిల్లో 40 శాతం చెల్లింపులో జాప్యం జరిగితే మాత్రం ఈ నెల 23వ తేదీ తర్వాత జేఏసీ సమావేశంలో రాష్ట్ర స్థాయిలో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలను ప్రకటిస్తామన్నారు.