ఆంధ్రప్రదేశ్‌

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 22: విజయనగరం కేంద్రంగా నిర్వహించనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2019-20 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. విశాఖలోని ఏయూ సెనేట్ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ విజయనగరం జిల్లా రెల్లి గ్రామంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం త్వరలోనే శాశ్వతంగా నెలకొల్పనున్నామని, తాత్కాలికంగా ఈ ఏడాది నుంచి తరగతులను మరో భవనంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు పీజీ కోర్సులు, రెండు సమీకృత కోర్సులను నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఆన్‌లైన్ విధానం ద్వారా ఏయూ వెబ్‌సైట్‌తో పాటు, ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబుల్ యూనివర్శిటీతో కలసి అర్హత పరీక్షను నిర్వహిస్తున్నామని, దీనికి ఆయా వెబ్‌సైట్‌ల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులంతా ప్రవేశాలకు వచ్చే నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 20 నుంచి ప్రవేశ పరీక్షకు హాల్‌టిక్కెట్లను వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామన్నారు. జూన్ 1,2 తేదిల్లో రాష్ట్రంలో 15 కేంద్రాల్లో పరీక్షలు జరుపుతామని, తరగతులను జూలై 3 నుంచి ప్రారంభిస్తామన్నారు. ఈ గిరిజన విశ్వ విద్యాలయానికి ఏయూ మెంటార్‌గా వ్యవహరిస్తుందని, ఇప్పటికే నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో డీపీ ఆర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఉన్నత విద్యామండలికి పంపంచామన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్ ఆచార్చ కె.నిరంజన్ పాల్గొన్నారు.
కోర్సుల వివరాలు ఇవే...
నూతనంగా ఏర్పాటు చేసిన గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభ సంవత్సరంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంసోషల్ వర్క్ కోర్సులను పీజీ విభాగంలోను, సమీకృత కోర్సుల విభాగంలో ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ), సమీకృత ఎంబీఎ కోర్సులను నిర్వహిస్తారు. అయితే మూడు ఏళ్ల తరువాత విద్యార్థులకు బిఎస్సీ,బిబిఏ డిగ్రీలు, ఐదేళ్ల తరువాత ఎమ్మెస్సీ, ఎంబీఏ డిగ్రీలు అందిస్తారు. వీటితో పాటు పీజీ డిప్లమో కోర్సుల విభాగంలో కంప్యూటర్ అప్లికేషన్స్, సైబర్ సెక్యూరిటీ, టూరిజం అండ్ హస్పిటల్ మేనేజ్‌మెంట్, డిప్లమో ఇన్ హర్టికల్చర్ కోర్సులను నిర్వహిస్తారు. కేవలం పీజీ, సమీకృత కోర్సులకు జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్షా ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పీజీ డిప్లమో కోర్సులకు విద్యార్థుల డిగ్రీ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అదే విధంగా పీజీ కోర్సుల్లో 20, సమీకృత కోర్సుల్లో 30, డిప్లమో కోర్సుల్లో 30 మంది చొప్పున విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామన్నారు. అదే విధంగా నెలరోజుల వ్యవధి కలిగిన నైపుణ్యాభివృద్ధి కోర్సులను సైతం నిర్వహించనున్నారు. స్థానికంగా అధిక ప్రాధాన్యత కలిగిన జ్యూట్ ఉత్పత్తుల తయారీ, మ్యాంగో జెల్లీ తయారీ, ఇటుక, టైల్స్ తయారీపై శిక్షణ అందిస్తామన్నారు.
చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు