ఆంధ్రప్రదేశ్‌

సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 25: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు.
విశాఖలో గురువారం ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి, చిత్తురు జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులతో వైద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమంపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది కంటే ఈ ఏడాది మలేరియా, డెంగ్యూ, సీజనల్ వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పట్టిందని, వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపడతున్నామన్నారు. వడదెబ్బ నివారణకు సంబంధించి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పూర్తిస్థాయిలో అందించామన్నారు. ముఖ్యంగా నాలుగు జిల్లాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా శాతం 67 శాతానికి తగ్గిందని, ఇప్పటికే తొలి విడత స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఆరోగ్య శాఖతో పాటు అనుబంధ శాఖలతో సమన్వయం ఏర్పరచుకుని వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 1200 మంది వైద్యుల నియామకాలు చేపట్టామని, ఏజెన్సీ ప్రాంతాల్లో నిరంతర వైద్య సేవలు అందేలా వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మాతా,శిశు మరణాలను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే బైక్ అంబులెన్స్ సేవలను విస్తృతం చేస్తున్నామన్నారు. మారుమాల ప్రాంతాల్లో తాగునీరు అందని ప్రాంతాలకు సకాలంలో తాగునీరు అందించే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సంప్రదిస్తున్నామన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులకు, చిన్నారుల కోసం 2,168 పౌష్టికాహర కేంద్రాలను ఏర్పాటు చేసి 23,220 మందికి రోజూ ఆహారాన్ని అందేలా చర్యలు తీసుకుంటన్నామన్నారు. ఆర్‌బీఎస్‌కె పథకం ద్వారా 31వేల మంది విద్యార్థులకు పుట్టికతో వచ్చే వ్యాధులను నయం చేసేందుకు వేసవి సెలవుల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో ఉచిత వైద్యసేవలందిస్తున్నామన్నారు. ఉత్తరకోస్తా జిల్లాల్లోని గిరిజనులకు మలేరియా వ్యాధి నుంచి తగ్గించేందుకు ఈ ఏడాది రాష్ట్రంలో 11 లక్షల దోమతెరలను పంపిణీ చేయనున్నామని పూనం మాలకొండయ్య తెలిపారు. తల్లిసురక్షా పథకాన్ని ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు, పీహెచ్‌సీల్లో కూడా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అరుణ్‌కుమారి, ఇమ్యూనైజేషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవి, కలెక్టర్ కె.భాస్కర్, ఐటీడీఏ పీవో బాలజీ, డిఎంహెచ్‌వో తిరుపతిరావు, డీసీహెచ్ డాక్టర్ నాయక్, జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..విశాఖలో మీడియాతో మాట్లాడుతున్న ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య. చిత్రంలో మహిళా శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, కలెక్టర్ కె.భాస్కర్