ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి దంపతుల ప్రతిమలతో వెండి డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 2 : భక్తుల కోసం శ్రీవేంకటేశ్వర స్వామి, అలుమేలు మంగమ్మ ప్రతిమలతో వెండి డాలర్లను తయారు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. 5, 10 గ్రాములతో రెండు రకాలైన డాలర్లను తయారు చేస్తారు. ఇందుకోసం టిటిడి రూ.5.5కోట్ల రూపాయలను కేటాయించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారక తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర వికలాంగుల పునరావాస సంస్థకు 10 కోట్ల రూపాయలు మూలనిధి ఇవ్వాలని ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వీరభద్రాపురం గ్రామంలోని శ్రీవీరేశ్వరి ఆలయం మరమ్మతులకు 25 లక్షల రూపాయలు నిధులు కేటాయించామన్నారు. తిరుపతి రాయలచెరువు ప్రాంతంలో 32లక్షల వ్యయంతో 46 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించామన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయానికి 31.25 లక్షలతో నూతన మహారథాన్ని తయారు చేసేందుకు నిర్ణయించామన్నారు. కడప జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయానికి 31.25 లక్షలతో మహారథాన్ని తయారు చేయించనున్నట్లు తెలిపారు. 2017 నూతన సంవత్సరానికి 12 పేజీలు కలిగిన క్యాలెండర్లను 18లక్షలు ముద్రించేందుకు ఆమోదం తెలిపామన్నారు. టిటిడి ప్రచురణలు విక్రయించే పుస్తకాలు, సీడీలు, భారతం, భాగవతం గ్రంథాలు డిస్కౌంట్ పద్ధతిలో నిరంతరం విక్రయించాలని నిర్ణయించామన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో దక్షిణ విభాగంలో వివిధ సౌకర్యాలతో రెండో ప్రవేశమార్గాన్ని అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో ప్లాట్‌ఫాం నిర్మాణానికి టిటిడికి చెందిన 0.74 సెంట్లు భూమిని మార్కెట్ ధరకు రైల్వేశాఖకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 12నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుతో పాటు రోజుకు ఒక లక్ష మందికి దర్శనం, అన్నప్రసాదాల వితరణకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. టిటిడిలో సెక్యూరిటీ, విజిలెన్స్ గార్డులుగా పునర్నియామకం పొందిన సైనిక పింఛన్‌దారుల భార్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించిన పింఛన్ ఉత్తర్వులను అమలుపరచాలని నిర్ణయించామన్నారు. భక్తులు సమర్పించిన తలనీలాలను ఈ-విక్రయాల ద్వారా జరిగిన విక్రయంతో మే మాసంలో 7.92 కోట్ల రూపాయలు, జూన్ 7.42 కోట్ల రూపాయల ఆదాయం లభించిందన్నారు.
కాగా టిటిడి బోర్డు సభ్యుడు విరాళంగా ఇచ్చిన నిధులతో అలిపిరి వద్ద గో సంరక్షణ శాలను మంగళవారం టిటిడి చైర్మన్ శంకుస్థాపన చేశారు.