ఆంధ్రప్రదేశ్‌

ఇక తాడో-పేడో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: మల్లన్న సాగర్ రిజర్వాయర్ బాధితులను కలిసి పరామర్శించేందుకు మలి విడత ప్రయత్నం చేయాలని, ఈ దఫా లాఠీ దెబ్బలకు, పోలీసు తూటాలకు గురైనా సరే రాష్ట్ర ప్రభుత్వంతో తాడో-పేడో తేల్చుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ గజ్వేల్ రానున్నందున అదే రోజున పెద్ద ఎత్తున చలో మల్లన్న సాగర్‌కు బయలుదేరాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. మంగళవారం టిపిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కోర్టు అనుమతితో మల్లన్న సాగర్‌ను సందర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అక్కడి పరిస్థితుల గురించి వివరించారు.
రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటున్నారని, ప్రభుత్వం అరాచకంగా వ్యవహారిస్తున్నదని, దీనిని వదలకూడదని, ప్రజల్లో ఎండగట్టాలని వారు సమావేశంలో అన్నారు. ఈ నెల 7న ప్రధాని నరేద్ర మోదీ గజ్వేల్‌కు రానున్నందున అదే రోజున భారీగా కార్యకర్తలతో చలో మల్లన్న సాగర్ పేరిట కదిలి వెళ్ళాలని నిర్ణయించారు. అంతేకాకుండా గజ్వేల్‌లోనే ప్రధానిని కలిసి వినతి పత్రం అందించేందుకు ప్రయత్నించాలని వారు భావించారు.
అయితే పోలీసులు అంత దూరం వెళ్ళేందుకు అనుమతించకుండా అరెస్టులు చేసే అవకాశం ఉన్నందున, జిల్లాల వారీగా వేర్వేరు బృందాలతో బయలుదేరాలని, పోలీసులకు చిక్కకుండా దూసుకెళ్ళేందుకు వ్యూహాలు చేసుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం జిల్లా కమిటీలను, అనుబంధ సంఘాలను ఆదేశించింది.
సమావేశానంతరం టి.పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీలోగా జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. అనంతరం 9వ తేదీన రాష్ట్ర పార్టీ సమావేశమై జిల్లా కమిటీల ఏర్పాటును సమీక్షిస్తుందని ఆయన తెలిపారు.