ఆంధ్రప్రదేశ్‌

సాగర్‌కు 14,872 క్యూసెక్కుల నీరు చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్ జలాశయానికి మంగళవారం 14,872 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. నాగార్జున సాగర్ కుడికాలువకు మంచినీటి అవసరాల కోసం జలాల విడుదలపై సందిగ్ధం కొనసాగుతోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల మంచినీటి అవసరాల నిమిత్తం 4.5 టీఎంసీల నీటిని శ్రీశైలం నుండి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డును కోరింది. కచ్చితమైన ఆదేశాలు అందకపోవడంతో మంగళవారం సాయంత్రానికి కూడా నీటిని విడుదల చేయలేదు. నేడో, రేపో నీటిని కుడికాలువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం 509.50 అడుగులకు చేరుకుంది. ఇది 130.8521 టీఎంసీలకు సమానం, జంటనగరాల తాగునీటి అవసరాల నిమిత్తం 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నుండి ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి నీటి చేరిక నిలిచిపోవడంతో సాగర్‌లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 806.60 అడుగులకు చేరుకుంది. ఇది 32.3781 టీఎంసీలకు సమానం.

నాగార్జున సాగర్ జలాశయం