ఆంధ్రప్రదేశ్‌

‘హోదా వచ్చితీరుతుంది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వపరంగా అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన బాధ్యత ఉందని, అది అమలుచేస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదాకు సంబంధించి ఎప్పటికపుడు హామీ ఇస్తునే ఉందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం వేచి చూస్తోందని, అయితే రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని తెలియజెసే క్రమంలో పార్లమెంటులో టిడిపి ఎంపిలు నిరసన వ్యక్తం చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం త్వరలో ఢిల్లీ వెళ్లారని, ప్రధాని, ఆర్ధిక మంత్రి ఇతర కేంద్ర మంత్రులతో కలిసి ప్రత్యేక హోదా అంశాన్ని చర్చిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా వచ్చితీరుతుందని తాము నమ్ముతున్నట్టు చెప్పారు.