ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో 139 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 2: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక వేత్త డాక్టర్ జహీర్ అహ్మద్ విశాఖలో 139 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. పింగళి జయంతి సందర్భంగా మంగళవారం నాడిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి గుర్తింపు తెచ్చిన జాతీయ జెండాకు రూపమిచ్చిన మహానుభావుడిని స్మరించుకోవడం భారతీయులుగా మన బాధ్యత అన్నారు. జాతీయ జెండాను తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. అయితే ఇంతటి మహత్కారాన్ని సాధించిన పింగళిని స్మరించుకునేందుకు కూడా ముందుకు రాకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పింగళి వెంకయ్య మరణించేనాటికి అత్యంత దుర్భర పరిస్థితులు అనుభవించారని అన్నారు. తెలుగు వాడి ఖ్యాతిని దేశ వ్యాపితం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. కృష్ణాజిల్లా దివి తాలూకా, భట్ల పెనుమర్రు గ్రామంలో ఆయన పేరిట జాతీయ స్మార్మక భవనాన్ని నిర్మించి భావి తరాలకు జాతీయ పతాక రూపకర్త జీవితాన్ని తెలియజేయాలని అన్నారు. అలాగే నవ్యాంధ్ర రాజధానిని ఈ ప్రాంతంలోనే చేపట్టిన దృష్ట్యా పింగళి విగ్రహాన్ని రాజధానిలోను, పార్లమెంట్ హాల్‌లోను ఏర్పాటు చేసేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలని, భారతరత్న ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 139 అడుగుల జాతీయ పతాకాన్ని విశాఖ వీధుల్లో ప్రదర్శించారు.

విశాఖ వీధుల్లో 139 అడుగుల
జాతీయ పతాకం ప్రదర్శన