ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ శ్రేణి నగరంగా అమరావతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తులో అద్భుతమైన నగరంగా అవతరించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ప్రపంచ శ్రేణి నగరంగా ఎదిగే సామర్థ్యం ఉందని గ్లోబల్ ప్రోపర్టీ కనె్సల్టెంట్స్ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. అమరావతి వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతాల్లో వౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలు నిమగ్నమై ఉన్నాయని పేర్కొంది. మంగళగిరిలో అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోరైలు వల్ల అమరావతి ఆకర్షణీయమైన నగరంగా మారుతుందన్నారు. చెన్నైయ్, బెంగళూరు, హైదరాబాద్‌ను కలుపుతూ ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ కారిడార్ అమరావతికి అనుసంధానం పెరుగుతుందన్నారు. రోడ్డు, రైల్ నెట్‌వర్క్‌తో పాటుగా కృష్ణానది అంతర్భాగంలో బిఆర్‌టిఎస్ ప్రత్యేక 3 కి.మీ అండర్ వాటర్ టనె్నల్ అమరావతి-విజయవాడను కలపనుందన్నారు. విజయవాడ, గుంటూరు నగరాలే అమరావతికి బలమన్నారు. అభివృద్ధి చెందుతున్న విజయవాడ లాంటి మైక్రో మార్కెట్‌లలో క్యాపిటల్ వాల్యూస్ చదరపు అడుగు 1800-7000 రూపాయలుగా ఉంది. మైక్రో మార్కెట్లలో ఉయ్యూరు, ఆటోనగర్, కానూరు, పోరంకి ప్రాంతాలు ఉన్నాయి. గుంటూరులో రాబోతున్న మైక్రోమార్కెట్లలో ఉండవల్లి, మంగళగిరి, గోరంట్ల ఉన్నాయన్నారు.
ఈ ప్రాంతాల్లో క్యాపిటల్ విలువ చదరపు అడుగు 2200 నుంచి 4500 రూపాయల వరకు ఉంది. ఈ నివేదికపై చీఫ్ ఎకనమిస్ట్ అండ్ నేషనల్ డైరెక్టర్, నెట్ ఫ్రాంక్ ఇండియా చీఫ్ డాక్టర్ సమంతక్ దాస్ మాట్లాడుతూ ఆంధ్రా అత్యుత్తమ రాజధాని నిర్మాణానికి చక్కటి ప్రయత్నాలు చేస్తోందన్నారు. విజయవాడలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలైన బెంజ్ సర్కిల్, బందర్ రోడ్డులో ఆఫీసు మార్కెట్ అద్దె విలువలు చదరపు అడుగుకు 60-70 రూపాయల మధ్య ఉంది. గుంటూరులో నాణ్యమైన ఆఫీసు ప్రదేశం కొరత ఉందన్నారు. బ్రాడీపేట, అరండల్ పేట, లాలాపేట, పట్నం బజార్‌లలో అద్దె చదరపు అడుగు 10-15 రూపాయలు ఉందన్నారు. విజయవాడ, గుంటూరు నగరాలు విపరీతంగా లబ్ధి పొందుతున్నాయన్నారు. డైరెక్టర్ వాసుదేవన్ అయ్యర్ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో అత్యాధునిక రాష్ట్ర రాజధానిగా అవతరిస్తుందన్నారు. ప్రతిభావంతులు, అవసరమైన వౌలిక వసతులు, పూర్తి స్థాయి వ్యాపార వాతావరణం వల్ల అన్ని కంపెనీలు ఇక్కడికి రావడానికి పోటీపడుతున్నాయన్నారు. అమరావతి అత్యాధునిక సామర్థ్యం ఉన్న పవర్ సెంటర్‌గా నిలుస్తుందన్నారు. హైదరాబాద్ మాత్రం అభివృద్ధిపరంగా తన మార్గాన్ని కొనసాగించనుందన్నారు.