రాష్ట్రీయం

జెఇఇలో వెయిటేజీకి మంగళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: దేశంలో ఐఐటిలు, ఎన్‌ఐటిలు, ఇతర జాతీయ సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఐఐటి జెఇఇలో వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇంటర్ మార్కుల వెయిటేజీకి మంగళం పలకాలని జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అపెక్స్ బోర్డు నిర్ణయించింది. అయితే ఐఐటి జెఇఇ రాయాలంటే అభ్యర్థులకు ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు రావడం తప్పనిసరి. అడ్వాన్స్ పరీక్షకు వెళ్లాలంటే ఆయా రాష్ట్రాల 20 శాతం పర్సంటైల్‌లో ఉండాలి. తాజా నిబంధనతో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించినట్టయింది. ఈ మార్పులు 2017 ఐఐటి జెఇఇ నుండి అమలులోకి వస్తాయని తెలిసింది. ఇంటర్ మార్కుల వెయిటేజీతో ర్యాంకులు సైతం తలకిందులవుతున్నాయి. జెఇఇలో టాపర్లకు ఇంటర్ మార్కులు కలపగానే, వారి ర్యాంకులు మారిపోతుండటంతోపాటు ఇంటర్ మార్కులవల్ల అనేక సాంకేతిక ఇబ్బందులను బోర్డు ఎదుర్కొంటోంది. అన్ని బోర్డులూ ఇంటర్ మార్కులను ప్రకటించే వరకూ ఎదురుచూడాల్సి వస్తోంది. మరోపక్క ఇంటర్ మార్కుల రివిజన్ తదితర ప్రక్రియలతో పాటు, రీ కౌంటింగ్, రీ వాల్యూయేషన్‌లలో మార్కులు పెరిగినవారు అప్పీలు చేయడం బోర్డుకు తలనొప్పిగా తయారైంది. అపెక్స్ బోర్డు అభిప్రాయానికి హెచ్‌ఆర్‌డి సైతం ఆమోదముద్ర వేసింది.

ఎమ్సెట్-3కి సన్నాహాలు
పరీక్ష కేంద్రాల ఎంపికలో సమస్యలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 3: మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి సెప్టెంబర్ 11న తెలంగాణ ఎమ్సెట్-3 నిర్వహించేందుకు వీలుగా జెఎన్‌టియు సన్నాహాలు చేస్తోంది. అయితే పరీక్ష కేంద్రాల ఎంపికలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిసింది. విద్యార్థులు పాత హాల్ టిక్కెట్లతో పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పాత హాల్‌టిక్కెట్లలో ఉన్న కేంద్రాల్లోనే పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఆ మేరకు ఎమ్సెట్ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నా కొన్ని కేంద్రాలను మార్చాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. పరీక్ష కేంద్రాలను మార్చేపక్షంలో విద్యార్థులకు కొత్త హాల్‌టిక్కెట్లను జారీ చేయాల్సి ఉంటుంది. అటువంటి కొత్త తలనొప్పులు లేకుండా పాత కేంద్రాల్లోనే పరీక్షలకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. సెప్టెంబర్ 11న పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఎమ్సెట్-3 పరీక్ష కన్వీనర్‌గా జెఎన్‌టియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్యను నియమించింది. తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ జోన్ ఎ, జోన్ బి, జోన్ సి ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రలో తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖపట్టణం కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఎమ్సెట్-2లో 56153 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేయగా, పరీక్షకు మాత్రం 50964 మంది హాజరయ్యారు.