ఆంధ్రప్రదేశ్‌

పథకాలపై విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లోకి తీసుకువెళ్లి, వాటికి ప్రచారం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడ సిఎం క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాలపై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. సంక్షేమ శాఖల్లోని పథకాలన్నీ ఏకరూపత కలిగి ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఒక శాఖలోని విజయవంతమైన పథకాలను మిగిలిన శాఖల్లో కూడా ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు ప్రవేశపెట్టిన విదేశీ విద్య వంటి పథకాలు, అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి కార్యక్రమాలకు విధి విధానాలు ఒకేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పథకాలకు ప్రచారం కల్పిస్తూ, వాటిపై ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కాపు కార్పొరేషన్‌లో విజయవంతమైన గ్రూప్ ఎంఎస్‌ఎంఇ పథకాన్ని బిసి కార్పొరేషన్‌లో కూడా ప్రవేశపెట్టాలని ఆయన ఆదేశించారు. పథకాలకు కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తే, మరిన్ని నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల కింద లబ్దిదారులకు నేరుగా నగదు ఇచ్చి చేతులు దులుపుకోకుండా అవి సద్వినియోగం చేసుకునేలా చూడడం అధికారులు బాధ్యత అని ఆయన చెప్పారు.
సంక్షేమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి, కార్పొరేట్ విద్యా సంస్థలను తలదనే్నలా ఫలితాలు తీసుకురావాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. అన్ని గురుకుల పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణ బాధ్యతను కూడా అధికారులు శ్రద్ధ వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బయోమెట్రిక్ నిర్వహణ బాధ్యతను ఒక ఏజెన్సీకి అప్పగించినప్పుడే నూరు శాతం విజయవంతం అవుతుందని ఆయన చెప్పారు. హాస్టళ్ళలో విద్యార్థులకు ఎటువంటి పౌష్టికాహారం ఇవ్వాలన్నదానిపై ఒక కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని ఆయన సూచించారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో పెద్ద ఎత్తున కూరగాయలు పండించాలని సిఎం సూచించారు. 2016-17 సంవత్సరానికి ఇవ్వనున్న స్కాలర్‌షిప్‌ల గురించి సిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాపు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడానికి సంబంధించి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని సిఎం చంద్రబాబు చెప్పారు. సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్షియల్ పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేసి మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందిస్తున్నా, దానికి వ్యతిరేకంగా ప్రచారం జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏలూరు సమీపంలోని వట్లూరులో ఉపాధ్యయుల శిక్షణ కేంద్రం నిర్మాణం చేపట్టినట్టు మంత్రి రావెల కిషోర్ బాబు తెలియచేశారు. ప్రతి శాఖలోను ఇన్నోవేషన్ సెంటర్లు, పాఠశాలల్లో చాప్టర్లు ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం ఈసందర్భంగా అధికారులకు తెలిపారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కొల్లు రవీంద్ర, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు పాల్గొన్నారు.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు

ఆదాయం పెంపునకు అడ్వైజరీ కమిటీ

విజయవాడ, ఆగస్టు 3: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పరచడానికి మరింత సృజనాత్మకతతో ఆలోచన చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖల ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి సిఎం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ఫైనాన్షియల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సిఎం ఆదేశించారు. వివిధ రంగాల ఆదాయ వనరులను మెరుగుపరచుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని విభాగాల్లో ఆదాయం పెంపొందించాలని ఆయన సూచించారు. ఆర్థిక శాఖలో 100 శాతం కంప్యూటరీకరణ జరగాలని సిఎం ఆదేశించారు. రియల్ టైం డేటా సేకరణ, విశే్లషణ కోసం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సిఎం ఆదేశించారు. వివిధ రాష్ట్రాలు ఆదాయ వనరులను ఏవిధంగా పెంచుకుంటున్నాయో అధ్యయనం చేయాలని, అక్కడ అనుసరిస్తున్న విధానాలను, మెరుగైన పద్ధతులను మన రాష్ట్రానికి అన్వయింప చేయడానికి వెనుకాడవద్దని సిఎం చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో ఏయే రంగాల్లో ఆదాయం వస్తోంది? మన రాష్ట్రంలో ఆ రంగం పరిస్థితి ఏంటి? ఆదాయం ఆర్జించలేకపోతే అందుకు కారణాలను కూలంకషంగా విశే్లషించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. తద్వారా మన ఆర్థిక వనరుల మెరుగుకు, ఆదాయం పెంపుదలకు ప్రయత్నించారు. ఇదిలా ఉండగా గత ఏడాతో పోల్చి చూస్తే, జూలై నాటికి ఆదాయంలో 9.43 శాతం పెరుగుదల కనిపించిందని అధికారులు వివరించారు. జూలై నెల ఆదాయానికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాత ఇది 11 శాతం కంటే ఎక్కువ ఉండచ్చని అధికారులు సిఎంకు తెలిపారు. మొదటి త్రైమాసికంతో పోల్చి చూస్తే వాణిజ్య పన్నులశాఖ 14.64 శాతం, రవాణా శాఖ 22 శాతం, గనుల శాఖ మూడు శాతం, రెవెన్యూ శాఖ 9.14 వృద్ధి రేటు కనబరిచాయని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు యనమల, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

రెవెన్యూ సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు